చంద్రబాబూ… ఆ రోజు చెప్పిందేమిటి? ఈ చెబుతున్నదేమిటి? : సోము వీర్రాజు

Share Icons:

విజయవాడ, 23 ఫిబ్రవరి:

రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరంలేదని, ఆ మాటెత్తితే జైలుకు పంపుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.

శుక్రవారం ఉదయం విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో సోము వీర్రాజు మాట్లాడుతూ… ప్రత్యేక హోదాతో ఒరిగేదేమీ లేదని ఆనాడు చంద్రబాబునాయుడు చెప్పిన మాటలనే తానిప్పుడు చెబుతున్నానని అన్నారు.

హోదా వస్తే రూ. 3 వేల కోట్ల మేరకు మాత్రమే లబ్ది కలుగుతుందని తెలుగుదేశం పెద్దలకు చంద్రబాబు స్వయంగా చెప్పారని గుర్తు చేశారు.

అప్పట్లో హోదా ఉన్న రాష్ట్రాలకన్నా ఏపీకే నిధులు ఎక్కువ వచ్చాయని ఆయన అన్నారని, ఇప్పుడు తాను అవే మాటలు చెబుతుంటే విమర్శిస్తున్నారని మండిపడ్డారు. దీని బట్టి ఇప్పుడు ఎవరు జైలుకి వెళ్లాలని ఆయన ప్రశ్నించారు.

ఎందుకు మాట మారుస్తున్నారని చంద్రబాబును ప్రశ్నించలేని తెలుగుదేశం నేతలు, ఇప్పుడు తనపై విరుచుకుపడుతున్నారని వీర్రాజు ఆరోపించారు.

కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ సకాలంలోనే వచ్చాయని, వస్తున్నాయని ఇప్పుడు కావాలనే బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా విశ్వసించిందని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ధర్మయుద్ధం జరుగుతుందని చెప్పారు. మీ కాళ్ళకు మొక్కుతాను, ఈ విషయాలపై మీడియా మిత్రులు సీఎం చంద్రబాబును ప్రశ్నిచాలని మీడియా వారిని ఆయన కోరారు.

మామాట: ఇచ్చారని మీరు…ఇవ్వలేదని వాళ్ళు…మధ్యలో ప్రజలు అమాయకులు…

English summary:

The BJP MLC, Somu Veerraju, said that Chief Minister Chandrababu had warned that the state does not need special status and that will be sent to jail.

Leave a Reply