వాళ్ళు దేశం విడిచి వెళ్ళాలి..లేదంటే కాల్చేయండి….

Bjp mla raja singh sensational comments on rohingya muslims
Share Icons:

హైదరాబాద్, 1 ఆగష్టు:

గత కొంతకాలంగా బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు…ఇక ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో ముందుండే హైదరాబాద్‌లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యా ముస్లింలు, బంగ్లాదేశీయులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

రోహింగ్యా ముస్లింలను, బంగ్లాదేశీయులని వాళ్ల దేశాలకు వెంటనే పంపించి వేయాలని కేంద్రాన్ని కోరుతున్నానని చెప్పారు.  అత్యంత ప్రమాదకరమైన వారిని మన దేశంలో ఉంచుకోవడం హానికరమని అన్నారు. మన దేశాన్ని విడిచి వెళ్లేందుకు వారు అంగీకరించకపోతే కాల్చి చంపాలని కోరారు.

ఇక హైదరాబాదులో కూడా భారీ సంఖ్యలో రోహింగ్యా ముస్లింలు అక్రమంగా నివసిస్తున్నారని,  ముఖ్యంగా పాతబస్తీలోని ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో వీరు ఎక్కువగా నివసిస్తున్నారని చెప్పారు. రోహింగ్యాలకు ఎంఐఎం ఎమ్మెల్యేలు ఆర్థికంగా సాయం చేస్తున్నారని, రోహింగ్యా ముస్లింలంతా టెర్రరిస్టులకు అనుకూలంగా ఉంటారని ఆరోపించారు.

మామాట: ఇలాంటి వ్యాఖ్యలు సరికాదేమో..

Leave a Reply