బీజేపీ ఎమ్మెల్యేకి యావజ్జీవ కారాగార శిక్ష!

Share Icons:

అలహాబాద్, ఏప్రిల్ 20,

ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే అశోక్ సింగ్ కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఆయనతో పాటు మరో 9 మందికి కూడా ఇదే శిక్షను విధిస్తూ అలహాబాద్ హైకోర్టు తీర్పును వెలువరించింది. 22 ఏళ్ల క్రితం ఐదుగురు కుటుంబసభ్యులను హతమార్చిన కేసులో హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.

ఈ సందర్భంగా అశోక్ సింగ్ మాట్లాడుతూ, హైకోర్టు తీర్పును తాను గౌరవిస్తున్నానని చెప్పారు. న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు.

మామాట: నేరం సరే- తీర్పు ఇంత ఆలస్యమా స్వామీ

Leave a Reply