21న జనసేనలో చేరనున్న బీజేపీ ఎమ్మెల్యే….

Share Icons:

రాజమండ్రి, 10 జనవరి:

గత కొంతకాలంగా బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీ మార్పు వ్యవహారంపై నడుస్తున్న ఉత్కంఠకు తెరపడింది. తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నానని, ఈ నెల 21న పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరుతున్నట్లు  ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆకుల మండిపడ్డారు. రైల్వే జోన్, దుగరాజుపట్నం పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్ విషయాల్లో కేంద్రం అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు. ఏపీలో బీజేపీ బలోపేతానికి చేసిందేమీ లేదని విమర్శించారు.
ప్రజల భావోద్వేగాలను పట్టించుకోకపోవడం వల్ల సంక్షేమ పథకాలు పెట్టినప్పటికీ బీజేపీ ప్రజాదరణ పొందలేకపోయిందని సత్యనారాయణ స్పష్టం చేశారు.

ఇక జనసేన పార్టీలో ఏ పదవి ఇచ్చినా సిద్ధమని, ఎలాంటి షరతులు లేకుండా పార్టీలో చేరుతున్నట్లు కూడా ప్రకటించారని తెలుస్తోంది. ప్రస్తుతం రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్న ఆకుల.. అవసరమైతే జనసేన నుంచి రాజమండ్రి లోకసభకు కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.

మామాట: హామీలు అమలు చేయలేదని ఇప్పుడు చెబుతున్నారా.

Leave a Reply