టీడీపీలాగే జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారు…..

CM YS Jagan Mohan Reddy to address CRDA meeting on Amaravati capital
Share Icons:

అమరావతి:

 

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ మాటల దాడి పెంచింది. రివర్స్ టెండరింగ్ , పీపీఏల పునః సమీక్షా విధానం ప్రధాని మోడీ, అమిత్ షాలకి తెలిసే జరుగుతున్నాయని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు దాడి పెంచారు. తప్పులు చేసి బీజేపీపై నెట్టాలని సీఎం జగన్‌ ఎందుకు అనుకుంటున్నారని పురంధేశ్వరి ప్రశ్నించారు. పీపీఏల రద్దు, పోలవరం రివర్స్‌ టెండర్లు జగన్‌ స్వయంకృతాపరాదమని అన్నారు.

 

టీడీపీలాగే జగన్‌ కూడా మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారని ఆమె విమర్శించారు. పీపీఏల రద్దు విషయంలో కేంద్రం లేఖలు రాసినా జగన్‌ ఎందుకు పట్టించుకోలేదన్నారు. ప్రతి నిర్ణయానికీ మోదీ, షా ఆశీస్సులు ఉన్నాయనడం అబద్ధమని పురంధేశ్వరి స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గతంలో చంద్రబాబు చేసిన తప్పులే ఇప్పుడు జగన్ ప్రభుత్వం చేస్తోందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ప్రాజెక్టుల విషయంలో ఏకపక్షంగా వెళ్లొద్దని చెబుతూనే ఉన్నామన్నారు.

 

న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని చెప్పినా… జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. వారు చేసిన తప్పును ధైర్యంగా చెప్పుకోలేక కేంద్రంపై నెట్టడం సరికాదన్నారు. రివర్స్ టెండరింగ్ విషయంలో కేంద్రం సూచనలను జగన్ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో ప్రభుత్వ నిర్ణయాలు తప్పని తేలిపోయిందని చెప్పారు. కనీసం పోలవరం అథారిటీ దృష్టికి కూడా ఏ విషయాలను తీసుకెళ్లలేదన్నారు.

Leave a Reply