18న అమిత్ షా వస్తున్నారు…దమ్ముంటే అడ్డుకోండి…

Share Icons:

కర్నూలు, 3 జనవరి:

జనవరి 6న ఏపీకి మోదీ పర్యటన ఉండగా..కొన్ని కారణాల వల్ల ఆ పర్యటన వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే మోదీ ఏపీలో అడుగుపెడితే అడ్డుకుంటామని టీడీపీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 18న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా  రాయలసీమలో పర్యటించనున్నారు.

ఈ సందర్భంగా బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. రాష్ట్రంలో అమిత్‌షా పర్యటించనున్నారని దమ్ముంటే అమిత్‌షా పర్యటనను అడ్డుకోవాలని అన్నారు. అసలు రాష్ట్రంలో అవినీతి జరగకపోతే సీబీఐని ఎందుకు అడ్డుకున్నారని, శివాజీ టీడీపీకి రాజకీయ దళారి అని, టీడీపీ ముసుగు ధరించిన పొలిటికల్ బ్రోకర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక బీజేపీలో మళ్లీ కలిసేందుకు టీడీపీ నేతలు బీజేపీ కేంద్ర కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని ఆయన అన్నారు.. కాగా, ఇప్పటికే బీజేపీ నేతలు ఏం చేశారని ఆంధ్రకు వస్తున్నారంటూ టీడీపీ నేతలు ప్రశ్నల దాడి చేయడం మొదలుపెట్టారు.

టీడీపీ నేతల మాటలకు సమాధానంగా మోదీనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో, బీజేపీ నాయకులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో అనేక సమాధానాలిచ్చారు. ఏపీకి ఎంతో సాయం చేశామని, ఇకపై కూడా చేస్తామంటూ మోదీ చెప్పారు.

మామాట: మరి టీడీపీ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో…

Leave a Reply