జగన్ గారూ..! అక్కడ చెరువులని వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారు…

CM YS Jagan Mohan Reddy to address CRDA meeting on Amaravati capital
Share Icons:

అమరావతి:

 

వైసీపీ నేతలపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు బహిరంగ లేఖ రాశారు. ప్రకాశం జిల్లా కారుమంచి ప్రాంతంలో వైసీపీ నేతలు చెరువును కబ్జా చేస్తున్నారని కన్నా ఆరోపించారు. ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు విజయభాస్కర్ రెడ్డి, రమణ పలు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

 

రైతులు వ్యవసాయం చేసుకునేందుకు కీలకమైన ఈ చెరువు కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కన్నా విజ్ఞప్తి చేశారు. అలాగే గోదావరి వరదల సందర్భంగా నష్టపోయిన ప్రజలకు ఏపీ ప్రభుత్వం అండగా నిలవాలని కోరుతూ మరో లేఖ రాశారు.

 

మరోవైపు టీడీపీ నేత వర్ల రామయ్య కూడా జగన్ పై విమర్శలు చేశారు. ‘మీ సేవ’ రద్దు చేస్తున్నారని వస్తున్న వార్తలు నిజమో, కాదో ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పష్టత ఇవ్వాలని వర్ల రామయ్య కోరారు. అసలు ఇలాంటి విపరీతమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.

 

జగన్ 73 రోజుల పరిపాలన ‘రద్దుల పాలన’గా పేరు గాంచిందని ఎద్దేవా చేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండే ‘మీ సేవ’ను రద్దు చేయవద్దని వర్ల రామయ్య కోరారు. ప్రతీ పనిని గ్రామ వాలంటీర్లే చూసుకుంటారని చెప్పడం ప్రజలను మోసగించడమే అవుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు వర్ల రామయ్య ట్వీట్ చేశారు.

Leave a Reply