ఎస్పీ ఎంపీ ఆజంఖాన్ తల నరికి పార్లమెంట్ ద్వారానికి వేలాడదీయాలన్న బీజేపీ నేత

BJP leader calls for chopping off Azam Khan's head for his Rama Devi comment
Share Icons:

ఢిల్లీ:

 

ఎప్పుడు ఏదొక వివాదంలో ఉంటున్న సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. లోక్‌సభలో ట్రిపుల్ తలాక్‌ బిల్లుపై చర్చ సందర్భంగా ప్యానెల్ స్పీకర్ రమాదేవిని ఉద్దేశించి ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. చర్చ జరుగుతుండగా ఆజంఖాన్ మాట్లాడుతూ.. మీ కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ మాట్లాడాలని ఉందని రమాదేవిని ఉద్దేశించి  అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది.

 

ఇక ఎంపీ రమాదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆజంఖాన్‌పై బీజేపీ నేత ఆఫ్తాబ్ అద్వానీ మండిపడ్డారు. రమాదేవిపై ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేనన్న ఆయన, ఆజం తలను తెగనరకాలని, పార్లమెంటు ద్వారానికి వేలాడదీయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. తద్వారా మహిళలను అవమానిస్తే ఏం జరుగుతుందో ఆజంఖాన్, అసదుద్దీన్ ఓవైసీ లాంటి వారికి తెలిసొస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

మహిళలను అవమానపరిస్తే ఇకపై ఎంతమాత్రమూ ఉపేక్షించబోమని ఆఫ్తాబ్ హెచ్చరించారు. ఆజంఖాన్ తొలుత జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు రమాదేవిని అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఖండించాల్సిన విషయమన్నారు. అసలు ఈ పెద్దమనిషికి పిచ్చెక్కిందని తాను ఇది వరకే చెప్పానని గుర్తుచేశారు. దేశానికి హానికరంగా తయారవుతున్న పిచ్చి కుక్కను చంపాల్సిందేనని ఆఫ్తాబ్ తేల్చి చెప్పారు.మరి ఆఫ్తాబ్ వ్యాఖ్యలపై ఆజంఖాన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Leave a Reply