గోవా కొత్త సియం వేటలో బిజెపి

BJP in Goa's new CM, hunt
Share Icons:

పనాజీ, మార్చి 18,

ముఖ్యమంత్రి  మనోహర్‌ పారికర్‌ మరణంతో గోవా రాజకీయాలలో మళ్లీ వేడి పుట్టింది.  కొత్త సారథి ఎవరనేదానిపై చర్చలు జరుగుతున్నాయి.  పారికర్ చనిపోయిన కొద్దిసేపట్లోనే బిజెపి మంత్రి నితిన్‌ గడ్కారీ రాష్ట్రానికి చేరుకున్నారు. భాగస్వామ్య పక్షాలతో కలిసి రాత్రి పొద్దుపోయే దాకా చర్చలు జరిపారు. కానీ సమావేశంలో తదుపరి సియం ఎవరన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదని డిప్యూటి స్వీకర్‌ తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గోవాలో మహారాష్ట్ర వాదీ గోమంటక్‌ పార్టీనేత సుదిన్‌ దావలికర్‌ తననే సియం చేయాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బిజెపి శాసనసభ్యులు కూడా పార్టీ నుంచే అభ్యర్ధిని ఎన్నుకోవాలని కోరుతుండడంతో విషయం ఓ కొలిక్కి రాలేదంటున్నారు.

మరో వైపు గోవా ఫార్వర్డ్‌ పార్టీ అధినేత విజయ్ సర్‌దేశాయ్ కూడా బిజెపి అధినాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఫార్వర్డ్‌ పార్టీ ఇంతవరకు పారికర్‌కు మద్దతు పలికింది. బిజెపికి కాదు అని సర్‌దేశాయ్  వివరించారు. కాని రాష్ట్రంలో అతి పెద్ద పార్టీయైన  కాంగ్రెస్‌ తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బిజెపికి 12 మంది ఎమ్మెల్యేలుండగా మిత్రపక్షాలతో కలిపి 20 మంది బలం ఉంది. 14 మంది శాసనసభ్యులతో అసెంబ్లీలో కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా ఉన్న విషయం తెలిసిందే.

మామాట: భాజాపా తన తప్పు ఇప్పిటికైనా దిద్దుకుంటుందా….

Leave a Reply