ఆ ముగ్గురు మాజీ సీఎంలకు కొత్త పదవులిచ్చిన బీజేపీ…

Share Icons:

ఢిల్లీ, 11 జనవరి:

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌లకు బీజేపీ అధిష్ఠానం కొత్త పదవులు ఇచ్చింది.

వీరు ముగ్గురినీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమిస్తూ గురువారం జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో వీరు ముగ్గురూ కీలక పాత్ర పోషించనున్నారు.

అయితే ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం.. తనకు మధ్యప్రదేశ్‌లోనే బాగుందని, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం లేదని చెప్పారు. కానీ అంతలోనే ఆయనను జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

మామాట: అంతా అమిత్ షా ప్లాన్‌లా ఉంది..

Leave a Reply