గుర్రానికి బీజేపీ జెండా రంగులు… ఫిర్యాదు చేసిన మేనకా గాంధీ సంస్థ!

Share Icons:
  • మంత్రివర్గ విస్తరణ జన ఆశీర్వాద యాత్ర
  • ఇండోర్ లో జ్యోతిరాదిత్య సింథియా యాత్ర
  • జంతు ప్రేమికుల ఆగ్రహం… పిర్యాదు

బీజేపీ దేశవ్యాప్తంగా జన ఆశీర్వాద యాత్రలు చేపడుతోంది. తెలుగు రాష్ట్రాలలో కేంద్ర పర్యాటక శాఖామంత్రి కిషన్ రెడ్డి యాత్రల చేపట్టగా , మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా వినూత్నంగా గుర్రానికి బీజేపీ జెండా రంగు వేసి యాత్రలో ప్రవేశ పెట్టారు. దీనితో జంతు ప్రేమికులకు కోపం వచ్చింది. ఇది జంతు హింస కిందకే వస్తుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా నిర్వహించిన ఈ యాత్రలో గుర్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీకి చెందిన పీపుల్ ఫర్ యానిమల్స్ (పీఎఫ్ఏ) స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. ఇది కచ్చితంగా జంతువులను హింసించడం కిందికే వస్తుందని భావిస్తూ వారు ఇండోర్ లోని సంయోగితా గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లాలని వారు నిర్ణయించారు.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply