జనసేన-బీజేపీ జట్టు: జగన్‌కు నష్టమా? బాబు స్ట్రాటజీ ఇదేనా?

tdp president chandrababu sensational comments on boston consultancy
Share Icons:

అమరావతి: ఏపీలో ఎప్పుడైతే మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. వైసీపీ మినహా మిగతా పార్టీలన్ని అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ-జనసేనలు కలిసి వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ..జనసేన మధ్య పొత్తు అధికారికంగా ఖరారు కావటం పైన టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ నేతలతో తాజాగా సమావేశమయ్యారు. ఈ పొత్తు ఏ రకంగా ప్రభావం చూపుతుందనే అంశం పైన చర్చించారు. ఈ పొత్తు టీడీపీకి ఏ రకంగా లాభ..నష్టాలు కలిగిస్తుందనే అంశం పైన చర్చించారు. ఈ కొత్తు పొత్తు పైన మౌనం వహించాలని పార్టీ నిర్ణయానికి వచ్చింది.

ఈ రెండు పార్టీల పొత్తు కారణంగా సీఎం జగన్ కు కొత్త చిక్కులు తప్పవని టీడీపీ అంచనాకు వచ్చింది. అమరావతి నుండి రాజధాని తరలింపు అంశంతో పాటుగా జగన్ మీద ఉన్న కేసుల విషయంలోనూ ఇబ్బందులు ఎదురవతాయని టీడీపీ నేతలు భావిస్తున్నారు. జగన్‌ కేసుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదని టీడీపీ అధినేత సమక్షంలో జరిగిన సమావేశంలో అభిప్రాయం వ్యక్తం అయింది. ఇప్పటి వరకు బీజేపీ నుండి ఎన్నికల ముందు నుండే జగన్ సహకారం పొందారని..ఇప్పుడు జనసేనతో పొత్తు కారణంగా ..ఏపీలో ఆ రెండు పార్టీలు బలపడేందుకు అడుగులు వేస్తాయని..ఆ క్రమంలో జగన్ కు ఉచ్చు బిగిసేలా ఢిల్లీ నుండి కార్యాచరణ అమలయ్యే అవకాశం ఉంటుందంటూ పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేసారు.

ఇదే సమయంలో రాజధాని వ్యవహారంలో అన్ని పార్టీలు కలిసి పోరాటం చేస్తున్నందున.. పరస్పర విమర్శలతో ఉద్యమం పక్కదారి పట్టవచ్చని.. అందువల్ల తామే కొంత నిగ్రహంతో ఉండాలని అనుకుంటున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. అమరావతి విషయంలో జనసేన, బీజేపీ కలిసి ఉద్యమం చేపట్టే అవకాశముందని అంటున్నారు. బీజేపీ సొంతంగా ఉద్యమం చేపట్టడమంటే రాజధాని మార్పును వ్యతిరేకిస్తున్నట్లే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజధాని మార్పునకు వ్యతిరేకంగా ఉద్యమిస్తే రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని మార్చడం అంత తేలిక కాదంటూ టీడీపీ అధినేత వ్యాఖ్యానించినట్లు సమాచారం.

 

Leave a Reply