TRENDING NOW

పాకిస్థాన్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చిన భారత సైన్యాధిపతి

పాకిస్థాన్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చిన భారత సైన్యాధిపతి

ఢిల్లీ, 27 అక్టోబర్:

జమ్ము కశ్మీర్‌లోని అనంత నాగ్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం ‘సరిహద్దు రోడ్డు సంస్థ’ బృందానికి భద్రత కల్పిస్తున్న జవానులపై ఓ గుంపు రాళ్ల దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ దాడిలో తలకు బలమైన గాయమవ్వడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ రాజేంద్ర సింగ్ అనే 22 ఏళ్ల జవాను అమరుడయ్యాడు.

ఈ నేపథ్యంలోనే భారత సైన్యాధిపతి బిపిన్ రావత్ పాకిస్తాన్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చారు. జమ్ము కశ్మీర్ విషయంలో భారత్ పై ఎప్పటికీ విజయం సాధించలేదని పాక్ అర్థం చేసుకుందని అన్నారు. దీంతోనే ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ప్రవేశించేందుకు సాయం చేస్తూ అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తోందన్నారు. పాక్ ప్రయత్నాలను అడ్డుకునే అన్నీ ఆపరేషన్‌లను సమర్థవంతంగా నిర్వహించగలుగుతామని స్పష్టం చేశారు. 

Life Homepathy
treefurn AD
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,

సరిహద్దు రోడ్ల సంస్థ బృందానికి భద్రత కల్పిస్తున్న బృందంపై ఓ సమూహం రాళ్లతో దాడి చేసిందని, ఈ దాడిలో ఓ జవాను అమరుడయ్యాడని వెల్లడించారు.

మామాట: పాక్ వక్ర బుద్ధి మరోసారి బయటపడింది….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: