వెండితెరపై పుల్లెల గోపీచంద్

Share Icons:

ఈ మధ్యకాలంలో ప్రముఖుల జీవిత చరిత్రలని తెరకెక్కిస్తున్నారు. ధోని,సచిన్, అజారుద్దీన్ ఇలా పలువురి బయోపిక్ లని నిర్మించారు. ఆ క్రమంలోనే ఇప్పుడు ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు,పద్మశ్రీ అవార్డు గ్రహీత పుల్లెల గోపీచంద్‌ జీవితాధారంగా ఒక సినిమా రూపొందించాలని గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు ఈరోజు గోపీచంద్‌ పుట్టినరోజు సందర్భంగా దీని  గురించి చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అబండన్టియా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా గోపీచంద్‌ జీవితచరిత్రను నిర్మిస్తున్నాయి. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. 2018 మే నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. ‘గరుడవేగ’తో విజయాన్ని అందుకొన్న ప్రవీణ్‌ సత్తారు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు . హీరో సుధీర్‌బాబు గోపీచంద్ పాత్రలో నటించే అవకాశం ఉంది.

Leave a Reply