తొలి పరమ్‌ వీర్‌ చక్ర గ్రహీత జోగిందర్‌ జ్ణాపకాలకు ఊపిరిపోస్తూ బయోపిక్..

Share Icons:
భారతదేశం, 14డిసెంబర్:

ఎంతో కాలంగా వేచిచూస్తున్న వార్‌ హీరో, తొలి పరమ్‌ వీర్‌ చక్ర అవార్డు గ్రహీత  ‘సుబేదార్‌ జోగిందర్‌ సింగ్‌’ బయోపిక్‌ సినిమా వచ్చే ఏడాది వేసవిలో హిందీ, తమిళ్‌, తెలుగు మూడు భాషల్లో ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది.

స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్‌ ఇండియన్‌ ఆర్మీలో, ఆ తర్వాత ఇండియన్‌ ఆర్మీలో ‘సుబేదార్‌ జోగిందర్‌ సింగ్‌’ పనిచేశారు.

మూడు యుద్ధాల్లో ఆయన తన ప్రాణాలను ఎదురొడ్డి మరీ దేశం కోసం పోరాటం చేశారు.

1962లో జరిగిన భారత్‌ – చైనా యుద్ధంలో సుబేదార్‌ సింగ్ వీర మరణం పొందారు. మరణానంతరం సుబేదార్‌ను భారత ప్రభుత్వం పరమ్‌ వీర్‌ చక్ర అవార్డుతో సత్కరించింది.

యుద్ధకాలంలో సుబేదార్‌ కనబర్చిన వీరత్వం త్వరలో పైకి వస్తోంది..

ప్రస్తుతం విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌తో అమరవీరుడిగా నటిస్తున్న గిప్పి గ్రేవాల్‌, సుబేదార్‌గా ఎలా మారిపోయారో తెలిసిపోతుంది.

సాగా మ్యూజిక్‌, యూనిసిస్ ఇన్ఫోసొల్యూన్స్‌తో కలిసి సెవన్‌ కలర్స్‌ మోషన్ ఫిక్చర్స్‌ ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు.

గిప్పి గ్రేవాల్‌, గుగ్గి గిల్‌, కుల్విన్దర్‌ బిల్ల, అదితి శర్మ, రాజ్‌వీర్‌ జవాండ, రోషన్‌ ప్రిన్స్‌, సర్దార్‌ సోహిలు ఈసినిమాలో కీలక పాత్రల్లో నటించనున్నారు.

మామాట: దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన ఆ అమరవీరుడి కథను తెరకెక్కించాలన్న ఆలోచన రేకెత్తడం అభినందించదగ్గ విషయం

Leave a Reply