అదిరిపోయే రేంజ్ లో ప్రీ-రిలీజ్ చేసిన విజయ్ బిజిల్…

Bigil Pre-release Business: The Vijay Starrer Makes A Huge Table Profit!
Share Icons:

హైదరాబాద్: కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ హీరోగా అట్లీ డైరక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘బిజిల్’. స్పొర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమా అదిరిపోయే రేంజ్ లో ప్రీ రిలీజ్ చేసింది. ఒక్క తమిళనాడులోనే ఈ సినిమా 83.55 కోట్ల బిజినెస్ జరుపుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మేర బిజినెస్ అయింది. ఇతర రాష్ట్రాలతో కలుపుకుని దేశవ్యాప్తంగా 108 కోట్ల బిజినెస్ జరుపుకుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 138.55 కోట్ల బిజినెస్ జరిగిందనేది ట్రేడ్ వర్గాల మాట.

తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజునే ఈ సినిమా 3 కోట్ల వసూళ్లను రాబడుతుందని భావిస్తున్నారు. అభిమానులు ఆశిస్తున్నట్టుగా, ఈ సినిమాతో విజయ్ కొత్త రికార్డులు సృష్టిస్తాడేమో చూడాలి. తెలుగులో ఈ సినిమాను ‘విజిల్’ పేరుతో అదే రోజున భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు హైదరాబాదులో ఘనంగా నిర్వహించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి.

ఫుట్ బాల్ క్రీడ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. అందువలన ఈ సినిమా టీమ్, గ్రామీణ ప్రాంతాల్లో ఫుట్ బాల్ క్రీడాభివృద్ధికి తోడ్పడే ‘మార్స్’ ఫుట్ బాల్ ఫౌండేషన్ ద్వారా 40 మంది బాలబాలికలకు ఫుట్ బాల్ కిట్స్ ను అందించనుంది. విజయ్ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన సరసన నాయికగా నయనతార కనిపించనుంది.

మత్తు వదలరా అంటున్న తారక్…

కోడూరి సింహ హీరోగా తెరకెక్కుతున్న ‘మత్తు వదలరా’ చిత్రం ఫస్ట్ లుక్ ను జూనియర్ ఎన్టీఆర్ ఈ ఉదయం తన ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. “సమయం గడిచిపోతోంది. నా సోదరులంతా పెరిగిపోయారు. సింహా కోడూరి హీరోగా, భైరి సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘మత్తు వదలరా’ చిత్రం ఫస్ట్ లుక్ ను నేడు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. తొలి చిత్రాలతోనే వీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర టీమ్ కు శుభాకాంక్షలు” అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.

Leave a Reply