విజిల్ హిట్…..ఖైదీ సూపర్ హిట్…దుమ్మురేపిన తమిళ హీరోలు…

bigil and khaidi movie collections...hit movies
Share Icons:

హైదరాబాద్: ఒకేరోజు థియేటర్లలోకి వచ్చిన తమిళ హీరోల సినిమాలు కలెక్షన్లలో దుమ్మురేపాయి. అక్టోబర్ 25న విడుదలైన ఖైదీ, బిగిల్(విజిల్) సినిమాలు భారీ విజయాలు సొంతం చేసుకున్నాయి. విజిల్ మొదట్లో మంచి ఓపెనింగ్స్ రాబట్టిన తర్వాత కాస్త స్లో అయింది. కానీ ఖైదీ మొదట్లో కొంచెం తడబడ్డ నిదానంగా మౌత్ టాక్ తో కలెక్షన్లలో దూసుకెళుతుంది. ఇప్పటికీ ఖైదీ కలెక్షన్లు తగ్గలేదు.

ఇక విజిల్ తెలుగు రాష్ట్రాల్లో గత రెండు వారాల కలెక్షన్లు పరిశీలిస్తే.. నైజాంలో 3.6 కోట్లు, సీడెడ్‌లో రూ.2.85 కోట్లు, ఉత్తరాంధ్రలో 1 కోటికిపైగా, తూర్పు గోదావరి జిల్లాలో రూ.67 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.50 లక్షలు, గుంటూరులో రూ.1. 1 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.69 లక్షలు, నెల్లూరులో రూ.46 లక్షలు రాబట్టింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విజిల్ చిత్రం రూ.10.25 కోట్ల మేర ప్రీ రిలీజ్ జరిగిందనేది ట్రేడ్ రిపోర్టు. అయితే గత 14 రోజుల్లో ఈ చిత్రం 11 కోట్లకుపైగానే వసూళ్లను రాబట్టింది. రెండు వారాల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడంతో డిస్టిబ్యూటర్లకు ఉపశమనం కలిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఇలా ఉన్నాయి తమిళనాడులో అత్యధికంగా 125 కోట్లు, కర్ణాటకలో రూ.18 కోట్లకుపైగానే.. కేరళలో రూ.18 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో రూ.4 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తంగా ఇండియాలో రూ.180 కోట్లకుపైగా, ఓవర్సీస్‌లో రూ.85 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.270 కోట్లు మేర గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. త్వరలోనే ఈ చిత్రం రూ.300 కోట్ల క్లబ్‌లో చేరడానికి అవకాశం ఉంది. అటు మొత్తం మీద 135 కోట్ల పైనే షేర్ వసూలు చేసి హిట్ గా నిలిచింది.

ఇక ఖైదీ అయితే కలెక్షన్ల దుమ్ములేపి సూపర్ హిట్ గా నిలిచింది. ఖైదీ సినిమా ఇప్పటివరకు రూ.80కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఓవర్‌సీస్‌లో మరో రూ.10కోట్లు వరకు రాబట్టింది. సినిమా మొదటి రోజు రూ.3.5కోట్లు వసూళ్లు రాబట్టగా.. మూడో రోజు నుంచి వరుసగా వసూళ్లు పెరుగుతూ పోయాయి. ఒక్క తమిళనాడులోనే మొదటివారంలో రూ.25కోట్లు గ్రాస్ రాబట్టింది. కేరళ,ఆంధ్రప్రదేశ్‌లలోనూ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ఇదే ఊపు కొనసాగితే కార్తీ సినిమా రూ.100కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం. అయితే 29 కోట్ల షేర్ తో బాక్సాఫీస్ బరిలో దిగిన ఖైదీ ప్రస్తుతం 43 కోట్ల షేర్ వరకు రాబట్టింది.

Leave a Reply