కర్ణాటకలో బీజేపీకి పెద్ద షాక్……

Share Icons:

బెంగళూరు, 1 నవంబర్:

కర్ణాటకలో బీజేపీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మరో రెండు రోజుల్లో ఉప ఎన్నికలు జరగనున్న సమయంలో.. బీజేపీ తరపు నుంచి పోటీ చేసే వ్యక్తి.. తన నామినేషన్‌ని ఉపసంహరించుకుని….కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే…ఈ ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో సీఎం కుమారస్వామి రామనగర, చెన్నపట్న రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన రామనగర నియోజకవర్గ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో.. ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. 

ఈ ఉప ఎన్నికలో జేడీఎస్ నుంచి కుమార స్వామి తన భార్య అనితను బరిలోకి దించారు. ఇక బీజేపీ నుంచి ఎల్. చంద్రశేఖర్ నామినేషన్ వేశారు.  సరిగ్గా రెండు రోజుల్లో ఉప ఎన్నిక ఉంది అనగా.. చంద్రశేఖర్ తన నామినేషన్ ఉప సంహరిచుకొని, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. 

ఇక ఈ హఠాత్ పరిణామానికి బీజేపీ కంగుతిన్నది. ఇప్పుడు కుమార స్వామి భార్య అనితకు ఎవరూ పోటీ లేకుండా పోవడం గమనార్హం. దీంతో ఆమె గెలుపు ఖాయమని స్పష్టంగా అర్థమౌతోంది. 

మామాట: ఇది ఊహించని షాకే…

Leave a Reply