బిగ్ బాస్: రెండో వారం ఎలిమినేషన్ జోన్ లోకి వెళ్లింది వీళ్ళే…

big boss telugu ..this week elimination
Share Icons:

హైదరాబాద్:

 

మొదటివారం ఎంతో ఆసక్తిగా సాగిన బిగ్ బాస్ షో…రెండో వారంలోకి అడుగుపెట్టింది. మొదటివారం చివరిలో హేమ ఎలిమినేట్ అయ్యి…ట్రాన్స్ జెండర్ తమ్మన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో షోలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమన్నా నిన్న ఇంట్లోకి ప్రవేశించింది. ఇక రాగానే తమన్నా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం ప్రారంభించింది. మహేష్, వరుణ్ సందేశ్ దంపతుల మధ్య జరిగిన గొడవ తన అభిప్రాయాన్ని క్లియర్‌గా చెప్పింది. మహేష్‌ను చీప్ అని వరుణ్ అనడాన్ని తప్పుపట్టింది. తప్పులేకపోయినా సారీ చెప్పడం ఎందుకని మహేష్‌ను నిలదీసింది.

 

ఇక ఈ వారం కోసం నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టి నిబంధనలు బిగ్‌బాస్ వెల్లడించారు. నామినేషన్ ప్రక్రియ గురించి ఎవరూ చర్చించకూడదని క్లియర్ చేశాడు. కానీ కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లి వచ్చిన తర్వాత వరుణ్…తన భార్య వితిక చెవిలో గుసగుసలు పెట్టుకోవడంపై బిగ్‌బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఇతరులను నామినేట్ చేయడానికి వీలులేదని ఆదేశించారు. ఇక నామినేషన్ ప్రక్రియలో బాబా భాస్కర్ బిగ్‌బాస్‌ను చాలా సేపు ఇరిటేట్ చేశాడు. బాబాకు మూడుసార్లు అవకాశం ఇచ్చి ఇద్దరి పేర్లను నామినేట్ చేయమని.. చెప్పగా.. అందుకు నిరాకరించారు. కానీ తప్పనిసరిగా చెప్పాల్సిందేనని బిగ్‌బాస్ ఆర్డర్ పాస్ చేశాడు. అయినా తాను ఎవరి పేర్లు చెప్పలేనని బాబా భాస్కర్ మొండికేశాడు.

 

దాంతో బిగ్‌బాస్ నీవు ఇద్దరు సభ్యులను నామినేట్ చేయకపోతే నామినేషన్ ప్రక్రియ రద్దు చేస్తాం. ఆ స్థానంలో ప్రతీ ఇంటి సభ్యుడు నామినేట్ అవుతాడని బిగ్‌బాస్ తన తీర్పును ప్రకటించారు. ఇక దీంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో వితిక, రాహుల్‌ను నామినేట్ చేశాడు. మొత్తం మీద ఈ వారానికి శ్రీముఖి, హిమజ 5 ఓట్లతో నామినేట్ కాగా, రాహుల్, మహేష్, వితిక, వరుణ్ సందేశ్, పునర్నవి తదితరులు నామినేట్ అయ్యారు.

Leave a Reply