తొలిరోజే ఆరుగురిని నామినేట్ చేసి ఊహించని షాక్ ఇచ్చిన బిగ్ బాస్

big boss telugu season first day
Share Icons:

హైదరాబాద్:

 

బిగ్ బాస్ తెలుగు మూడవ సీజన్ తొలి రోజే హౌస్ మేట్స్ కి ఊహించని షాక్ తగిలింది. ఆదివారం జరిగిన షోలో ఇంటిలోకి వెళ్లగానే అషురెడ్డి, రవికృష్ణ, సావిత్రికి ఇచ్చిన టాస్క్ గురించి బిగ్‌బాస్ అడిగి తెలుసుకొన్నారు. ఈ ముగ్గురు సెలబ్రిటీలు అడిగిన ప్రశ్నలకు సెలబ్రిటీలు ఇచ్చిన సమాధానాల ఆధారంగా సెలబ్రిటీలను నామినేట్ చేశాడు. రాహుల్‌, వరుణ్‌ సందేశ్‌, వితికా షెరు, శ్రీముఖి, బాబా భాస్కర్‌, జాఫర్‌ లు నామినేట్‌ అయినట్లు బిగ్‌ బాస్‌ ప్రకటించాడు.

 

అయితే ఈ నామినేషన్ దేనికోసమోనని హౌస్ మేట్స్ అందరూ చర్చించుకుంటుండగానే, నామినేషన్ నుంచి తప్పించుకునే అవకాశాన్ని కల్పిస్తూ, అందరూ కలిసి ఓ మానిటర్‌ ను ఎన్నుకోవాల్సిందిగా సూచించగా, హేమను వారు ఎన్నుకున్నారు. అలాగే నామినేట్‌ అయిన ప్రతి సభ్యుడు మిగిలిన ఇంటిసభ్యుల్లోంచి ఒకరిని తనకు బదులుగా రీప్లేస్ చేయవచ్చని, అందుకు కారణాలను చెప్పాలని, తుది నిర్ణయం మాత్రం మానిటర్‌ దేనని చెప్పాడు.

 

అయితే ఇక ఈ నామినేషన్ ప్రక్రియ నుంచి ఎవరు తప్పించుకుంటారు? కొత్తగా ఎవరు చేరుతారన్నది నేడు తేలుతుంది. కాగా, తొలి రోజున ఉదయం వేళ బాబా భాస్కర్‌, జాఫర్‌ లు తమ యోగా ప్రదర్శనలతో కాస్త వినోదాన్ని పంచారు. మరి చూడాలి రోజురోజుకూ బిగ్ బాస్ ఎలాంటి ప్లాన్స్ తో ముందుకెళ్తాడో

 

Leave a Reply