రెండోరోజు ఆసక్తిగా సాగిన బిగ్ బాస్: ఎలిమినేషన్ లోకి ఆరుగురు సభ్యులు….

big boss telugu season elimination
Share Icons:

హైదరాబాద్:

 

బిగ్ బాస్ తెలుగు సీజన్ రెండో రోజే మంచి రసవత్తరంగా సాగింది. ముగ్గురు మొదటి కంటెస్టెంట్‌లు ఎంపిక చేయడంతో ‘బిగ్ బాస్’ మొదటి రోజే ఆరుగురు సభ్యులు నామినేషన్ అయిన విషయం తెలిసింది. అలాగే ఆ ఆరుగురు హేమని మానిటర్ గా ఎన్నుకున్నారు. ఇక  హేమను మెప్పించే విధంగా తమ గురించి తాము చెప్పుకుని, మరొకరిని తమ బదులు మరొకరిని నామినేట్ చేయొచ్చని బాస్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఈ అవకాశం ఐదుగురికే ఉందని చెప్పాడు.

 

అందులో భాగంగానే మొదటిగా రాహుల్ తనకి బదులుగా నామినేట్ చేయడానికి శివజ్యోతిని ఎంపిక చేసుకున్నాడు. కానీ, అతడి కారణాలు నచ్చక హేమ.. రాహుల్‌నే నామినేట్ చేశారు. తర్వాత వరుణ్ సందేశ్.. పునర్నవిని ఎంపిక చేసుకున్నాడు. దీనికి హేమ కూడా అంగీకరించింది. అనంతరం వితిక.. అషు రెడ్డిని చేసినా లాభం లేకుండా పోయింది. తర్వాత శ్రీముఖి.. హిమజను చేసింది. దీనికి హేమ ఒప్పుకుంది. అలాగే, జాఫర్.. మహేశ్‌ను చేయగా హేమ ఒప్పుకోలేదు.

 

చివరికి ఆరో సభ్యుడు బాబా భాస్కర్‌కు ‘బిగ్ బాస్’ ఒక అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం మానిటర్‌గా ఉన్న హేమతో ఆయనను రీప్లేస్ చేసుకోవచ్చని చెప్పాడు. దీంతో సభ్యులందరూ ఆలోచించుకుని హేను ఎలిమినేట్‌కు నామినేట్ చేసి, భాస్కర్ ని సేవ్ చేశారు. దీంతో హేమతో కలుపుకుని రాహుల్, జాఫర్, వితిక, పునర్నవి, హిమజలు ఈ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.

Leave a Reply