ఈ వారం నామినేషన్ లోకి ఏడుగురు సభ్యులు

big boss telugu elimination nomination monday
Share Icons:

హైదరాబాద్:

 

శనివారం, ఆదివారం ఎపిసోడ్ లు సరదాగా ఉన్న బిగ్ బాస్ షో సోమవారం మరింత రసవత్తరంగా సాగింది. మొదట ఇంటి పనులు, వంట పనులు గురించి హౌస్ మేట్స్ చర్చించుకుని పనులు కేటాయించుకున్నారు హౌస్ మేట్స్. బాబా భాస్కర్ వంట పనులు నుండి తప్పుకుని మహేశ్ విట్ట వచ్చాడు. ఆ తర్వాత వరుణ్-వితికల మధ్య చిన్నపాటి రొమాన్స్ జరిగింది. ఇక ఈ 13 మందికి సంబంధించి సోమవారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ జరిగింది.

 

మొన్న బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ విజయవంతంగా పూర్తి చేసిన అలీ, పునర్నవి లని నామినేషన్ నుంచి తప్పించారు. అలాగే శ్రీముఖిని డైరెక్ట్ గా నామినేషన్ లో ఉంచిన విషయం తెలిసిందే. దీంతో మిగిలిన 10మంది సభ్యులని జంటలుగా వచ్చి ఎవరు నామినేట్ అవుతారో చర్చించుకుని ఆ పేరుని బిగ్ బాస్ కి చెప్పాలని సూచించారు. ముందుగా రవిక‌‌ృష్ణ, వితిక వెళ్లారు. గతంలో టాస్క్ సంబంధించి ఇంటి ప్రాపర్టీని డామేజ్ చేసినందుకు నేను నామినేట్ చేసుకొంటానని అన్నాడు.

 

 

ఆ తర్వాత శివజ్యోతి-రోహిణిలలో మొదట శివజ్యోతిని నామినేట్ చేసిన బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ సందర్భంగా నియామాలను ఉల్లంఘించినందుకు రోహిణిని కూడా నామినేట్ చేశాడు. అంతేకాకుండా వచ్చే వారం కూడా శివజ్యొతి, రోహిణిని నామినేట్ చేస్తూ బిగ్‌బాస్ షాకిచ్చాడు. వీరి తర్వాత మహేష్ విట్ట-వరుణ్ సందేశ్, రాహుల్-హిమజ,బాబా భాస్కర్-ఆషూ వెళ్లి నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. వీరిలో వరుణ్, రాహుల్, బాబా భాస్కర్ లు నామినేట్ అయ్యారు.

Leave a Reply