వితికాని ఏడిపించిన వరుణ్…హౌస్ కి కొత్త కెప్టెన్ బాబా భాస్కర్…

big boss telugu 47th episod hilights baba bhaskar new captain of the house
Share Icons:

హైదరాబాద్:

బిగ్ బాస్ ఏడోవారం ఎపిసోడ్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. మొన్న దొంగలు దోచిన నగరం టాస్క్ లో పెద్ద రచ్చ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ గురువారం ఎపిసోడ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. ఎపిసోడ్ ప్రారంభమవ్వడమే వరుణ్-వితికల మధ్య గొడవ జరిగింది. ఇద్దరు ఓ వాదించుకున్నారు. త‌న‌తో టైం స్పెంట్ చేయ‌మ‌ని వితికా వ‌రుణ్‌ని కోర‌గా దానికి అత‌ను మ‌నం వ‌చ్చింది హ‌నీమూన్‌కి కాదు, బిగ్ బాస్ షోకి అని కాస్త ర్యాష్‌గా అన‌డంతో వితికా వెక్కి వెక్కి ఏడ్చింది.

అయినా వరుణ్ మళ్ళీ ఏదొకటి అంటూనే ఉన్నాడు. దీంతో వితిక బోరున ఏడ్చుకుంటూ బాత్రూమ్ కి వెళ్లిపోయింది. అయితే ఆ తర్వాత బాబా భాస్కర్ ఇద్దరికి సర్ది చెప్పడంతో కూల్ అయ్యారు.  ఇక తర్వాత జైలులో ఉన్న రాహుల్‌, ర‌వితో కాసేపు పున‌ర్న‌వి ముచ్చట్లు పెట్టింది. ఈ స‌మ‌యంలో పునర్న‌విని రాహుల్ అదొక పిచ్చిది అంతే వాగుత‌ది అనే స‌రికి ఆమె హ‌ర్ట్ అయింది. ఆమె కూడా బాత్రూమ్ లోప‌లికి వెళ్లి క‌న్నీటి ప‌ర్యంత‌మైంది.

వీరి ఏడుపులు ఎపిసోడ్ తర్వాత ఇంటి స‌భ్యుల‌కి బిగ్ బాస్ కెప్టెన్ టాస్క్ ఇచ్చారు. ఇందుకోసం హౌజ్‌మేట్స్‌లో అర్హులైన ముగ్గురిని, అన‌ర్హులుగా మ‌రో ముగ్గురిని ఏకాభిప్రాయంతో ఎంపిక చేయాల‌ని బిగ్ బాస్ ఆదేశించారు. దీంతో బాబా భాస్క‌ర్, శ్రీముఖి, హిమ‌జ‌ల‌ని కెప్టెన్‌కి అర్హులుగా ప్ర‌క‌టిస్తూ శిల్ప, రవి, రాహుల్‌లను అనర్హులుగా తెలిపారు.

కెప్టెన్ టాస్క్ లో భాగంగా అనర్హులుగా ఉన్న వాళ్లు అర్హులైన వాళ్ళు కెప్టెన్ అయ్యేందుకు సహకరించాల‌ని చెప్పారు. దీంతో శ్రీముఖికి ర‌వి స‌పోర్ట్ చేయ‌గా బాబా భాస్క‌ర్‌కి శిల్పా చ‌క్ర‌వ‌ర్తి, హిమ‌జ‌కి రాహుల్ స‌పోర్ట్‌గా ఉన్నారు. టాస్క్ ప్ర‌కారం గార్డెన్ ఏరియాలో ఉన్న మూడు గ్లాస్ ట‌బ్స్‌లో ఇసుక‌ని నింపాలి. దీని కోసం పోటీలో ఉన్న ముగ్గురు త‌మ ట‌బ్‌లో ఇసుక పోయ‌కుండా అడ్డుకోవాలి. స‌పోర్ట్‌గా ఉన్న వారు అందులోని ఇసుక‌ని బ‌య‌ట‌ప‌డేయాలి.

ఎండ్ బ‌జ‌ర్ మోగే స‌మ‌యానికి ఎవ‌రి ట‌బ్‌లో త‌క్కువ ఇసుక ఉంటుందో వారే ఈ వారం కెప్టెన్‌గా ఉంటార‌ని బిగ్ బాస్ చెప్ప‌డంతో ఇంటి స‌భ్యులు రంగంలోకి దిగారు. ముఖ్యంగా అలీ.. హిమ‌జ‌నే టార్గెట్ చేసి ఇసుక వేశాడు. మ‌హేష్‌, పునర్నవిలు శ్రీముఖి బాక్స్‌లో ఇసుక వేస్తున్న‌ క్ర‌మంలో అలీ వాళ్ళని అడ్డుకోవ‌డంతో గేమ్‌కి విరుద్దంగా ఆడుతున్నావు అని మ‌హేష్ క్విట్ అయ్యాడు. అలీ ప్ర‌వ‌ర్త‌న‌పై గేమ్ త‌ర్వాత కూడా కొద్ది సేపు చ‌ర్చ జ‌రిగింది. చివ‌రికి గేమ్‌లో బాబా భాస్క‌ర్ విజేత‌గా నిల‌వ‌డంతో ఈ వారం ఇంటి కెప్టెన్‌గా బాబా భాస్క‌ర్‌ని ఎంపిక చేశారు.

Leave a Reply