కెప్టెన్ టాస్క్ లో కుమ్ముకున్న హౌస్ మేట్స్

big boss show captain task
Share Icons:

హైదరాబాద్:

 

సోమవారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ నామినేషన్ కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో రాహుల్, వరుణ్, బాబా భాస్కర్, రోహిణి, జ్యోతి, రవి ,శ్రీముఖిలు నామినేట్ అయ్యారు. ఇక నిన్న ఈ వారం ఇంటికి కెప్టెన్‌ని ఎంపిక చేసుకునే ప్ర‌క్రియ‌లో బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కి నేనే రాజు నేనే మంత్రి అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ కోసం గార్డెన్ ఏరియాలో ఉంచిన డ్రాగెన్ ఎగ్స్ ఎవ‌రైతో సొంతం చేసుకుంటారో వారికి ప్ర‌త్యేక ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని బిగ్ బాస్ చెప్ప‌డంతో డోర్ దగ్గ‌ర ఇంటి స‌భ్యులు బ‌జ‌ర్ కోసం వెయిట్ చేశారు. బ‌జ‌ర్ మోగ‌గానే రోహిణి, వితికా, శివ జ్యోతి గార్డెన్ ఏరియాలోకి స్పీడ్‌గా వెళ్ళి ఎగ్స్ సొంతం చేసుకున్నారు.

 

దీంతో వారు డ్రాగన్స్‌గా మారి డైరెక్ట్‌గా రెండో లెవ‌ల్‌కి వెళ్ళారు. మొద‌టి లెవ‌ల్‌లో గెలిచిన వారు వీరితో పోటీ ప‌డ్డారు. ఇక టాస్క్‌లో ఇంటి స‌భ్యుల‌ని విక్రమ పురి, సింహపురి అని రెండు రాజ్యాలుగా విడగొట్టి వారికి పోటి పెట్టారు. రెడ్ టీంకి శ్రీముఖి సేనాధిప‌తిగా పెట్టి, బ్లూ టీంకి హిమజని సేనాధిప‌తిగా ఉంచారు. గేమ్ ప్ర‌కారం రెండు రాజ్యాలకు బ్లూ, రెడ్ జెండాలు ఇచ్చి ఏ రాజ్యంలో ఎక్కువ జెండాలు ఉంటే వాళ్లే విజేతలుగా నిర్ణ‌యింప‌బ‌డ‌తారు అని తెలిపారు.

 

ఈ క్రమంలో హౌస్ మేట్స్ ఒకరిపై ఒకరు ఎటాక్ చేసుకున్నారు. ఎగ్స్ ఎవ‌రైతే సొంతం చేసుకుంటారో వారు త‌ర్వాతి లెవ‌ల్‌కి వెళ‌తారు. ఎగ్స్ కోల్పోయిన వాళ్లు పోటీ నుండి త‌ప్పుకోవ‌ల‌సి ఉంటుంద‌ని బిగ్ బాస్ పేర్కొన్నారు. గేమ్ ప్ర‌కారం పోటీలోకి దిగిన ఇంటి స‌భ్యులు ఎగ్స్ ద‌క్కించుకునేందుకు పోటీ ప‌డ్డారు. ఫైన‌ల్‌గా ర‌వి కృష్ణ‌, అలీ, రాహుల్ సిప్లిగంజ్ డ్రాగ‌న్ ఎగ్స్ సొంతం చేసుకున్నారు. దీంతో ఈ రోజు జ‌ర‌గ‌నున్న పోటీలో వీరిలో ఒక్క‌రు గెలుపొంది కెప్టెన్ పీఠాన్ని అధిరోహిస్తారు.

Leave a Reply