దెయ్యాలుగా మారిన హౌస్ మేట్స్: ఫైర్ అయిన పునర్నవి..

big boss new task...house mates change into devils
Share Icons:

 

హైదరాబాద్:

బిగ్ బాస్ షోలో రోజు ఏదొక ఆసక్తికరమైన టాస్క్ జరుగుతూ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైనమెంట్ ఇస్తుంది. సోమవారం ఎలిమినేషన్ ప్రక్రియ ఇంట్రెస్టింగ్ గా సాగగా, మంగళవారం ఇంటి సభ్యులకు లగ్జరీ బడ్జెట్ లో భాగంగా ఓ టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ పేరు ఇంట్లో దెయ్యం నాకేం భయం’. ఇందులో ఐదు దెయ్యాలుగా బాబా భాస్కర్, హిమజ, రాహుల్, శిల్ప, వితికాలు ఉంటారు. మ‌నుషులుగా ఉన్న వరుణ్, శ్రీముఖి, పునర్నవి, రవి, శివజ్యోతి, మహేష్‌లకు వారు విసుగుతెప్పిస్తూ ఉండాలి. అయితే రెండు ద‌శ‌లుగా ఈ టాస్క్ జ‌ర‌గ‌నుండ‌గా, మొద‌టి ద‌శ‌లో ముగ్గుర్ని చంపాల్సి ఉంటుంది.

అయితే దెయ్యాలు టాస్క్ ఏం చేయాలంటే మొదటిగా వరుణ్‌కి వితికా మూడు ముద్దులు పెట్టి బాత్రూం మిర్రర్‌పై వరుణ్ గోస్ట్ అని రాయాలని.. శ్రీముఖి తలపై కోడిగుడ్డు కొట్టాలని.. పునర్నవిని పూల్‌లోకి తోసేయాలని.. రవిని డాన్స్ వేసేట్టు చేయాలని.. మహేష్‌ని ఐదు సార్లు బట్టలు మార్చుకునేలా చేయాలని దెయ్యాలకు టాస్క్‌లు ఇచ్చారు. ఈ టాస్క్  మొదలు కాగానే దెయ్యాలుగా ఉన్నవారు రచ్చ చేయడం మొదలుపెట్టారు.

దెయ్యాలు ఇంట్లో కేక‌లు పెడుతూ వికృత చేష్ట‌ల‌తో మిగ‌తా మనుషుల స‌హ‌నాన్ని ప‌రీక్షించారు. వితికాకి ఇచ్చిన టాస్క్‌లో భాగంగా ఆమె .. వరుణ్‌కి మూడు ముద్దులు పెట్టి బాత్రూం మిర్రర్‌పై వరుణ్ గోస్ట్ రాస్తుంది. దీంతో వితికా మాములు మ‌నిషిగా మారుతుంది. వ‌రుణ్ చ‌నిపోయి దెయ్యంగా మారుతాడు. అటు హిమ‌జ .. శ్రీముఖి తలపై కోడిగుడ్డు కొట్టడం.. శిల్పా చ‌క్ర‌వ‌ర్తి.. పునర్నవిని పూల్‌లోకి తోసేయడంతో హిమ‌జ‌, శిల్పాలు మ‌నుషులుగా మారి శ్రీముఖి, పున‌ర్న‌వి దెయ్యం అవ‌తారం ఎత్తుతారు.

అసలు మిగతా ఇద్దరి దగ్గర ఎలాంటి ఇబ్బంది రాలేదు గానీ పునర్నవి టాస్క్ విషయంలో ఫుల్ రచ్చ జరిగింది. టాస్క్ అయిపోయాక పున్ను బిగ్ బాస్ పై ఫైర్ అయింది. ఇలాంటి గేమ్స్ ఎలా ఇస్తారు, వారు ఏం చేస్తున్నా కూడా సైలెంట్‌గా ఎలా ఉంటారు. బిగ్ బాస్ ఇది బుల్ షిట్ టాస్క్. మీ ఆటను మీరే ఆడుకోండి. మాకు చెప్పింది ఏంటి ఇక్కడ చేస్తుంది ఏమిటి? నన్ను రెండు సార్లు తోస్తుంటే ఏం చేస్తున్నారు. నన్ను ఈడ్చుకుంటూ పోతుంటే బాధ ఉండదా? అంటూ పునర్నవి బిగ్ బాస్‌కే వార్నింగ్ ఇచ్చింది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో కూడా ఈ టాస్క్ కొనసాగనుంది. ప్ర‌స్తుతం దెయ్యాలుగా ఉన్న మిగ‌తా వారు రవిని డాన్స్ వేసేట్టు చేయాలి, మహేష్‌ని ఐదు సార్లు బట్టలు మార్చుకునేలా ప్ర‌య‌త్నించాలి. మ‌రి ఇందులో ఎవ‌రు విజ‌యం సాధిస్తార‌నేది చూడాలి.

 

Leave a Reply