బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ పదవి దక్కించుకున్న అలీ

big boss new captain ali
Share Icons:

హైదరాబాద్:

 

బిగ్ బాస్ బుధవారం ఎపిసోడ్ రసవత్తరంగా జరిగింది. ఎపిసోడ్ ప్రారంభంలోనే శ్రీముఖి, రోహిణిల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. శ్రీముఖి.. నా ఎనాల‌సిస్ ప్ర‌కారం ఈ వారం నువ్వు వెళ్లిపోతావేమో అని రోహిణితోఅంది. ఈ మాట మొహం మీదే చెప్పేస‌రికి రోహిణి హ‌ర్ట్ అయింది. ఫ్రెండ్‌వి అయ్యిండి మొహం మీద అంటే ఎంత బాధ‌గా ఉంటుందని చెప్పి కన్నీరు పెట్టుకుంది. తర్వాత కొందరు హౌస్ మేట్స్ ఆమెని ఓదార్చారు. కానీ తమ మధ్య మూడో వ్యక్తి ఉండకూడదని భావించిన శ్రీముఖి…తానే రోహిణిని ఓదార్చి సారీ చెప్పింది. దీంతో వివాదం సద్దుమణిగింది

.

ఆ తర్వాత బిగ్ బాస్ కెప్టెన్ టాస్క్ మొదలుపెట్టారు. మొన్న డ్రాగన్ ఎగ్స్ దక్కించుకున్న అలీ, రాహుల్, రవి ల మధ్య టాస్క్ లో పాల్గొన్నారు. గార్డెన్ ఏరియాలో ఉన్న సింహాస‌నాన్ని అధిరోహిస్తారో వారే ఈ వారం ఇంటి కెప్టెన్ అవుతార‌ని బిగ్ బాస్ ఆదేశించారు. అయితే ఈ లెవ‌ల్‌లో మిగ‌తా ఇంటి స‌భ్యులు త‌మకి న‌చ్చిన డ్రాగన్స్‌కి స‌పోర్ట్ చేయ‌వ‌చ్చు, న‌చ్చ‌ని వాళ్ళ‌ని సింహాస‌నం నుండి లాగేయోచ్చు అని తెలియ‌జేశారు. ఎండ్ బ‌జ‌ర్ వ‌ర‌కు సింహాసనంపై ఎవ‌రైతే ఉంటారో వారే ఇంటి కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ పేర్కొన్నారు.

 

ఇక స్టార్ట్ బ‌జ‌ర్ మోగిన వెంట‌నే అలీ రాజా సింహాస‌నంపై కూర్చున్నాడు. అత‌నికి స‌పోర్ట్‌గా శ్రీముఖి, హిమ‌జ‌, బాబా బాస్క‌ర్ ఉన్నారు. సింహాస‌నం నుండి అలీని లాగేయ‌కుండా వారు అడ్డుకున్నారు.  అయితే ఒక సమయంలో వీరు పక్కన ఉంటామని మీరు ఆడమని చెప్పడంతో రాహుల్, రవిలు అలీని కిందకి దిగడానికి ప్రయత్నించారు. కానీ వారి వల్ల కాకపోవడంతో వారు మా వల్ల కాదన్నారు. దీంతో ఎండ్ బజర్ మోగే సరికి అలీ సింహాసనంలో ఉండటంతో కెప్టెన్ గా ఎంపికయ్యాడు.

 

Leave a Reply