బిగ్ బాస్ ఫన్నీ టాస్క్: బాబాకు ఏ‌బి‌సి‌డిలు రావు…శ్రీముఖితో వరుణ్ వాగ్వాదం

big boss funny task war words between srimukhi and varun
Share Icons:

హైదరాబాద్: ఈ వారం మొత్తం సీరియస్ టాస్క్ లు ఇచ్చి ఇంటి సభ్యులతో గేమ్ ఆడించిన…బిగ్ బాస్ శుక్రవారం ఎపిసోడ్ లో ఓ సరదా టాస్క్ ఇచ్చి ఆకట్టుకునేలా చేశాడు. ఇంటి సభ్యులకు మంచి డిన్నర్ ఇచ్చే పనిలో భాగంగా సీక్రెట్ అనలైజ్ టాస్క్ ఇచ్చారు. దీని ప్రకారం ఇంటి సభ్యులని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి ఒక్కొక్కరికి ఓ సరదా టాస్క్ ఇచ్చారు. అయితే లోపల జరిగిన టాస్క్ బయటకొచ్చి చెబుతారు…ఆ సభ్యుడు చెప్పేది నిజమో కాదో మిగతా సభ్యులు కరెక్ట్ గా గెస్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ కరెక్ట్ చెబితే ఇంటి సభ్యులకు నైట్ డిన్నర్ లభిస్తుంది.

ఈ టాస్క్ లో భాగంగా ముందుగా బాబా భాస్కర్ కన్ఫెష‌న్ రూంకి వెళ్ళ‌గా , ఆయ‌న‌ని 1,2,3ల‌తో పాటు ఏ, బీ, సీ,డీలు చెప్ప‌మని అంటాడు బిగ్ బాస్. ఇదే విష‌యాన్ని బ‌య‌ట‌కి వ‌చ్చి చెప్ప‌గా అంద‌ర‌కు నిజ‌మే చెప్పాడ‌ని గెస్ చేస్తారు. ఆ తర్వాత రవి-హిమజలని ఒకసారి పిలిచిన బిగ్ బాస్ వారికి స్వీట్స్, చాక్లెట్స్ తినమని చెబుతాడు. వాళ్ళు తినేసి బయటకొచ్చి అదే చెబితే మిగతా వాళ్ళు కరెక్ట్ గా గెస్ చేశారు. వీరి  తర్వాత పునర్నవి-శివ జ్యోతిలకు పద్యాలు చెప్పమని టాస్క్ ఇచ్చారు. వీళ్లది కూడా కరెక్ట్ గానే గెస్ చేశారు.

అయితే ఇలా క‌న్ఫెష‌న్ రూంలోకి వెళ్లి వ‌స్తున్న ఇంటి స‌భ్యులు చెప్పే మాట‌లు అన్నీ స‌రిగ్గా గెస్ చేసిన శ్రీముఖి. రాహుల్ విష‌యంలో బోల్తా కొట్టింది. అసలు విషయం ఏంటంటే కన్ఫెష‌న్ రూంలోకి వెళ్లిన రాహుల్ .. నాకు మా అమ్మ కాల్ చేసింది. పెళ్లి సంబంధాలు చూస్తున్నాం అని చెప్పింది. ఇంట్లో కొంచెం మంచిగా ఉండ‌మ‌ని గ‌ట్టింగా చెప్పింద‌ని అమ‌యాక‌పు ఫేస్ పెట్టి చెప్పాడు. రాహుల్ చెప్పిన విష‌యం క‌రెక్ట్ అని అంద‌రి కంటే ముందు శ్రీముఖి బ‌ల్లగుద్ది చెప్పింది. అంతే కాదు హార్ట్ బీట్ విని అది క‌రెక్ట్ అంటూ అంద‌రిని త‌న రూట్‌లోకి తీసుకొచ్చేసింది.

శ్రీముఖిపై వరుణ్ ఫైర్

మొద‌ట అది అబ‌ద్దం అన్న వాళ్ళు కూడా శ్రీముఖి మాట‌ల‌కి నిజం అని న‌మ్మేశారు. మొద‌ట ముగ్గురు మాత్ర‌మే నిజం అన‌డంతో ..నేను చెప్తున్నాగా.. మీరు అబద్ధం అనుకుంటే మనకు బొక్కపడుతుందని గ‌ట్టిగా శ్రీ అనడంతో అనుమానంగా ఇంటి సభ్యులు నిజమే అని చేతులు ఎత్తారు. అయితే ఆమె అంచనా తప్పిందని బిగ్ బాస్ చెప్పడంతో ఆమె అన్నట్టుగా నిజంగానే బొక్కపడింది. ఇక వ‌రుణ్‌.. శ్రీముఖిని చిన్న పాటి క్లాస్ పీకాడు. మొద‌ట నుండి చూస్తున్నాను నువ్వు అంద‌రిని డామినేట్ చేస్తావు. బొక్క ప‌డుతుంది అనే స‌రికి అంద‌రు సొంత స్టాండ్ తీసుకోలేక‌పోయారు అంటూ ఆమెపై ఫుల్ సీరియ‌స్ అయ్యాడు.

దీనికి శ్రీముఖి బొక్క ప‌డుతుంది అనే ప‌దం నా స్టైల్‌లో నేను ఉప‌యోగించేంది. ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. క‌త్తి మెడ మీద పెట్టి వారిని నేను ఫోర్స్ చేయ‌లేదు క‌దా అని వివ‌ర‌ణ ఇచ్చుకుంది. ఇలా కొద్ది సేపటి వ‌ర‌కు ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. ఆ త‌ర్వాత మ‌ళ్ళీ ఇద్ద‌రు చ‌ర్చించుకొని కూల్ అవ్వ‌డంతో డిన్న‌ర్ పార్టీని అంద‌రు క‌లిసి ఎంజాయ్ చేశారు.

Leave a Reply