బిగ్ బాస్: వరుణ్ కెప్టెన్: అలీని పిచ్చిగా తిట్టేసిన తమన్నా…

big boss fights...tamanna scolded ali raza
Share Icons:

హైదరాబాద్:

 

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 రోజు రోజుకి ఆసక్తికరంగా జరుగుతుంది. గురువారం కూడా హౌస్ మేట్స్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచారు. అందులో ముఖ్యంగా ఇంటిలో కెప్టెన్ ఎంపిక కోసం పవర్ గేమ్ టాస్క్‌ను బిగ్‌బాస్ నిర్వహించాడు. అందులో భాగంగా ఓ కిరీటం, డైమండ్ లాన్‌లో పెట్టి.. బజర్ మోగగానే వాటిని ముట్టుకొన్న వ్యక్తి ఇంటి పెద్దగా వ్యవహరించే అవకాశం దక్కుతుంది.

 

అయితే మొదటి బజర్ మోగగానే వరుణ్ సందేశ్ డైమండ్‌ను పట్టుకొన్నాడు. దాంతో మొదటి ఇంటి పెద్దగా వరుణ్ వ్యవహరించాడు. ఇంటి సభ్యులతో డ్యాన్సులు వేయించాడు. హిమజతో తన బట్టలు ఉతికించాడు. అలాగే రెండో‌సారి బజర్ మోగగానే అలి రజా డైమండ్‌ను సొంతం చేసుకొని ఇంటి సభ్యులను లీడ్ చేసే అవకాశాన్ని దక్కించుకొన్నాడు. అప్పుడు ఇంటి పెద్దగా వ్యవహరించిన అతడు.. ఇంటి సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చాడు.

 

అందులో భాగంగా మహిళలు, పురుషుల దుస్తులు.. పురుషులు మహిళల దుస్తులు ధరించాలని సూచించాడు. అప్పుడే ట్రాన్స్‌జెండర్ తమన్నా ఊగిపోయింది.  తనను కించపరిచే విధంగా వ్యవహరించారనే కోపంతో అలి రజాను నోటికి వచ్చినట్టు తిట్టింది. అందంగా ఉండగానే సరిపోదు. సినిమా ఇండస్ట్రీలో నీవు ఎప్పటికీ సూపర్‌స్టార్ కాలేవు. అందంగా ఉంటే హీరో కాలేడు.. సిక్స్‌ప్యాక్ ఉన్నంత మాత్రాన మగాడు అనుకోవద్దు అని తమన్నా ఘాటుగా మాటలను సంధించింది. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు వీడికి కిరిటం దొరికింది. ఆడపిల్లను పక్కన కూర్చొపెట్టుకోవడానికి సిగ్గు, శరం లేదు అంటూ స్వరాన్ని పెంచింది. దాంతో సావిత్రి, రోహిణి ఇతర మహిళా సెలబ్రిటీలు తమన్నాతో వాగ్వాదానికి దిగారు. అయినా తమన్నా తన పట్టు వదలకుండా అందరితో గొడవకు సిద్ధమైంది.

 

ఇక పవర్ టాస్క్‌లో డైమండ్‌ను హిమజ టచ్ చేసింది. తను పెద్దగా ఏమి హౌస్ మేట్స్ కి టాస్క్ ఇవ్వలేదు. చివరికి డైమండ్ టచ్ చేసిన ముగ్గురిలో వరుణ్ సందేశ్ కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. బిగ్‌బాస్ 3 సీజన్‌లో ఈయనే తొలి కెప్టెన్. ఇంటికి సంబంధించిన వ్యవహారాలను బిగ్‌బాస్ వరుణ్ చేతిలో పెట్టాడు.

 

Leave a Reply