ఎలిమినేషన్ లోకి ఆ ముగ్గురు…పునర్నవిపై వరుణ్ ఫైర్

big boss elimination process...mahesh,himaja, rahul nominated
Share Icons:

హైదరాబాద్: బిగ్ బాస్ షో రోజు రోజుకు ఆసక్తికరంగా సాగుతుంది. అందులో ముఖ్యంగా సోమవారం ఎలిమినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. బిగ్ బాస్ ఒక్కొక్కరికి ఫోన్ చేసి…ఎలిమినేషన్ కు నామినేట్ అవుతున్నారని చెప్పి…సేవ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఒక్కో సభ్యుడుకు ఇంకో సభ్యుడు త్యాగం చేసి సేవ్ చేశారు. అయితే మహేశ్ విషయంలో హిమజ సరైన త్యాగం చేయకపోవడం వల్ల మహేశ్ ఎలిమినేషన్ జోన్ లోకి వెళ్ళాడు.

అయితే ఈ ఎలిమినేషన్ ప్రక్రియ మంగళవారం ఎపిసోడ్ లో కూడా కొనసాగింది. మిగిలి ఉన్న రవిని సేఫ్ చేసేందుకు శివజ్యోతి తన హెయిర్ ని కట్ చేసుకుంది. దీంతో రవి సేఫ్ అయ్యాడు. ఇక రాహుల్ సేఫ్ అవ్వాలంటే పునర్నవి ఈ వారం మినహా మిగతా వారాలు ఎలిమినేషన్ కి నామినేట్ అవుతారని చెప్పారు. దీంతో రాహుల్ అందుకు ఒప్పుకోకుండా ఈ వారం సెల్ఫ్ నామినేట్ అయ్యాడు.

ఇక ఎప్పటిలాగే బిగ్ బాస్ కెప్టెన్‌గా ఉన్న వితికాకు తన ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి ఒకర్ని నేరుగా నామినేట్ చేయాల్సిందిగా కోరారు బిగ్ బాస్. దీంతో హిమజను నామినేట్ చేస్తూ మహేష్‌ను నామినేషన్ నుండి తప్పించలేకపోవడం వల్ల ఆమెను నామినేట్ చేస్తున్నట్టు తెలిపింది వితికా. మొత్తానికి పేడలో పడుకుని హిమజను నామినేషన్ నుండి వరుణ్ సేవ్ చేస్తే.. తనకు ఇష్టం లేకుండా సేవ్ చేయడనే కారణంతో మళ్లీ హిమజను ఎలిమినేషన్‌లోకి నెట్టింది వితికా. దీంతో ఈ వారం మహేశ్, రాహుల్, హిమజలు ఎలిమినేషన్ లోకి వెళ్లారు.

అయితే తర్వాత హిమజ కోసం నువ్ పేడలో పడుకోవడాన్ని నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నా అని వితికా ఎటకారంగా అనడంతో పక్కనే ఉన్న పునర్నవి కల్పించుకుని హిమజపై ఉన్న ద్వేషాన్ని వెళ్లగక్కింది. దీంతో వరుణ్ ఆమెకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి నోరు మూయించారు. నీ ఒపీనియన్ నీకు ఉంటుంది నా ఒపీనియన్ నాకు ఉంటుంది. హిమజను సేవ్ చేసిన దగ్గర నుండి యాటిట్యూట్ చూపిస్తున్నావ్.. పేడలో పడుకుంది నేను కదా.. నువ్ కాదు కదా.. నువ్ ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్’ అంటూ క్లాస్ పీకారు.

Leave a Reply