నామినేషన్ ప్రక్రియ: పేడ నీళ్ళలో పడుకున్న వరుణ్…రాహుల్ కు పున్నూ ముద్దు

big boss elimination process...different tasks for house mates
Share Icons:

హైదరాబాద్: బిగ్ బాస్ సోమవారం ఎపిసోడ్ లో ఆసక్తికరమైన ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టారు. గత నామినేషన్లకు భిన్నంగా ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది.  అందులో భాగంగా బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో ఓ టెలిఫోన్ బూత్ పెట్టారు. అయితే అందులో ఫోన్ సడన్ గా మోగింది. దీంతో శ్రీముఖి పరిగెత్తుకుంటూ వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసింది. అయితే ఫోన్ లిఫ్ట్ చేయగానే బిగ్ బాస్ వాయిస్ మాట్లాడుతూ…ఫోన్ లిఫ్ట్ చేసినందుకు గాను ఎలిమినేషన్ కు నేరుగా నామినేట్ అవుతున్నావని షాక్ ఇచ్చారు. కాకపోతే ఈ ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవాలంటే బాబా భాస్కర్ గడ్డం తీసేయాలని చెప్పాడు.

దీంతో శ్రీముఖి బాబా భాస్కర్ తో మాట్లాడి అసలు విషయం  చెప్పింది. ఇక శ్రీముఖి చెప్పగానే బాబా గడ్డం తీయడానికి ఓకే చెప్పి క్లీన్ షేవ్ చేశారు. దీంతో శ్రీముఖి సేఫ్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. ఆ తర్వాత పునర్నవికి కాల్ వచ్చింది. ఆమె ఎలిమినేషన్ నుంచి సేవ్ అవ్వాలంటే రాహుల్ 20 గ్లాసుల కాకరకాయల జ్యూస్ తాగాలని కండిషన్ పెట్టాడు. దీంతో రాహుల్.. నీ కోసం ఈ మాత్రం చేయలేనా అంటూ 20 గ్లాస్‌ల కాకరకాయ రసాన్ని బత్తాయి రసం తాగినట్టు తాగేశాడు. మధ్యలో చేదుకు వాంతులు అవుతున్నా.. పున్నూపై ఉన్న ప్రేమతో కక్కుకుంటూనే టాస్క్‌ను కంప్లీట్ చేశాడు.

ఇంత త్యాగం చేసి తనని సేవ్ చేసినందుకు పున్నూ రాహుల్ కు గట్టిగా హగ్ ఇచ్చి ఒక ముద్దు పెట్టింది. ఇక శివజ్యోతి కోసం మహేష్ తన జుట్టుకి రంగువేసుకోగా.. బాబా భాస్కర్ కోసం రవి తన షూస్ మొత్తాన్ని ఎరుపు రంగు డబ్బాలో ముంచి త్యాగం చేశాడు. దీంతో శివజ్యోతి, బాబా భాస్కర్ సేఫ్ అయ్యారు. ఆ తర్వాత బిగ్ బాస్ మహేశ్ సేవ్ కావాలంటే హిమజ తన  బట్టలు, మేకప్ కిట్ మొత్తం స్టోర్ రూమ్  పెట్టాలని చెప్పారు. కానీ హిమజ పూర్తిగా వస్తువులని పెట్టకపోవడంతో మహేశ్ ఎలిమినేషన్ కి నామినేట్ అయినట్లు చెప్పారు.

హిమ‌జ విష‌యంలో స‌రికొత్త ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. హిమ‌జ నువ్వు సేవ్ కావాలంటే త‌దుప‌రి ఆదేశం వ‌చ్చే వ‌ర‌కు వ‌రుణ్ సందేశ్ పేడ నీళ్ళు ఉన్న ట‌బ్‌లో ప‌డుకోవ‌ల్సి ఉంటుంద‌ని బిగ్ బాస్ పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని వ‌రుణ్‌కి చెప్ప‌గా అత‌ను చేసేందుకు సిద్ద‌ప‌డ్డాడు. ట‌బ్‌లో ప‌డుకున్న వ‌రుణ్‌కి క‌డుపులో తిప్పి వాంతులు కూడా అయ్యాయి. అయిన‌ప్ప‌టికి ఎంతో క‌ష్టంగా అందులో అలానే ప‌డుకున్నాడు. ఎట్ట‌కేల‌కి వ‌రుణ్ త‌న టాస్క్ స‌క్సెస్ ఫుల్‌గా పూర్తి చేయ‌డంతో హిమ‌జ సేఫ్ అయిన‌ట్టు బిగ్ బాస్ తెలిపాడు.ఈ రోజు మిగ‌తా ఇంటి స‌భ్యులు సేవ్ అయ్యేందుకు బిగ్ బాస్ ఎలాంటి టాస్క్‌లు ఇస్తాడో చూడాలి.

Leave a Reply