ఎవరు తగ్గలేదుగా…ఛలో ఇండియా టాస్క్ లో రెచ్చిపోయిన హౌస్ మేట్స్

big boss chalo india task..house mates acting perfromance peaks
Share Icons:

హైదరాబాద్:

బిగ్ బాస్ ఛలో ఇండియా టాస్క్ లో హౌస్ మేట్స్ విశ్వరూపం చూపించారు. బుధవారం ఎపిసోడ్ కి కొనగింపుగా సాగిన గురువారం ఎపిసోడ్ లో కూడా ఇంటి సభ్యులు అలరించారు. ఛలో ఇండియా టాస్క్ లో భాగంగా ఇంటి బయట ఉండే బిగ్ బాస్ ఎక్స్ ప్రెస్ లో ఎక్కి దేశంలోని వివిధ ప్రాంతాలని సందర్శించారు. అలాగే ఆగిన ప్రతి స్టేషన్ లో బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. అటు ఇంటి సభ్యులు ఎవరి పాత్రలో వారు జీవించారు. రవి-పునర్నవిలు జంటగా రొమాన్స్ తో రెచిపోయారు. ఇక అందమైన అమ్మాయిగా శ్రీముఖి అలీని రెచ్చగొట్టే పని చేసింది.

ఇక మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పాత్రకు న్యాయం చేశారు. ఈ క్రమంలో బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులు అలరించాయి. ఓ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇంటి కంటెస్టెంట్స్‌కి ‘స్టార్, కెమెరా, యాక్షన్’ అనే టాస్క్ ఇచ్చారు. దీని ప్రకారం ఐదు నిమిషాల నిడివితో వీడియోను తీయాలన్నారు. దీంతో ఎర్రగడ్డ లవ్ స్టోరీ అనే టైటిల్ పెట్టి బాబా భాస్కర్ దర్శకుడుగా ఉన్నారు. అలాగే  కెమెరామెన్‌గా వరుణ్, అసిస్టెంట్‌గా రాహుల్.. నటీనటులుగా శ్రీముఖి, హిమజ, రవి, అలీ, మహేష్,వితికలు ఉన్నారు.  అందరూ  ఓవర్ యాక్షన్ చేస్తూ కామెడీ చేశారు.

చేపలు పట్టిన అలీ,రాహుల్

ఆ తర్వాత స్విమ్మింగ్ ఫూల్‌లో పడ్డ చేపలు పట్టండని అలీ, రాహుల్‌లకు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. ఈ చేపలు పట్టే టాస్క్‌లో రాహుల్‌పై అలీని గెలిచారు. ఇక ఇంకో స్టేషన్ లో ట్రైన్ ఆగడంతో కొబ్బరికాయలకు పీచు తీయండని బాబా భాస్కర్, వరుణ్‌లకు టాస్క్ ఇవ్వగా.. బాబా భాస్కర్ పంటితో పీచు తీసి సత్తా చూపారు. చివరికి ట్రైన్ హైదరాబాద్ చేరుకోవడంతో ఇంటిలోని మగ సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చారు. ముత్యాలతో హారం చేసి నచ్చిన అమ్మాయి మెడలో వేయాలని కోరారు.

ఈ టాస్క్ లో అందరూ హారం చేసి నచ్చినవారి మెడలో వేశారు. అయితే ఎక్కువ అందంగా మహేశ్ హారం తయారు చేసి హిమజ మెడలో వేస్తాడు. చివరికి మహేశ్ ని విన్నర్ గా ప్రకటించారు. ఇంతటితో ఛలో ఇండియా టాస్క్ పూర్తి అయిందని బిగ్ బాస్ ప్రకటించడంతో ఇంటి సభ్యులు రిలాక్స్ అయ్యారు. అయితే ఇందులో మంచిగా ప్రదర్శన చేసిన ముగ్గురు పేర్లని చెప్పాలని బిగ్ బాస్ ఇంటి సభ్యులని కోరాడు. దీంతో అందరూ ఏకాభిప్రాయంతో వరుణ్,రాహుల్, బాబా భాస్కర్ పేర్లు చెబుతారు. ఇక వీరు శుక్రవారం ఎపిసోడ్ లో కెప్టెన్ టాస్క్ లో పాల్గొంటారు.

Leave a Reply