బిగ్ బాస్ సీజన్-3: షోలో పాల్గొనే కంటెస్టంట్స్ వీరే…….

big boss 3rd season starts tomorrow
Share Icons:

హైదరాబాద్:

 

గత రెండు పర్యాయాలుగా తెలుగు ప్రేక్షకులని విపరీతంగా అలరించిన బిగ్ బాస్ షో…..మరోసారి ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమైపోయింది. నాగార్జున్ హోస్ట్‌గా జూలై 21 నుండి ఈ షో ప్రారంభం కానుంది. అయితే ఇప్పటివరకు షో లో పాల్గొనే పోటీదారులపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రేపు షో మొదలయ్యాకే అధికారికంగా ఇందులో ఎవరు పాల్గొంటున్నారు అనేది తెలుస్తోంది.

 

అయితే ఎన్ఎన్ అనే పేరుతో సొంత యూ ట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన నూత‌న్ నాయుడు అందులో బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళ‌బోయే 15 మంది కంటెస్టెంట్స్ పేర్ల‌తో పాటు ఫోటోల‌ని రిలీజ్ చేశాడు. బిగ్ బాస్ హౌస్‌లో 100 రోజుల పాటు వీరు సంద‌డి చేయ‌నున్నార‌ని పేర్కొన్నాడు. మ‌రి వారిలో మొద‌ట‌గా నటి హేమ, 2. యాంకర్ శ్రీముఖి, 3. తీన్మార్ యాంకర్ సావిత్రి, 4. నటి హిమజా రెడ్డి, 5. వరుణ్ సందేశ్, వితికా షెరు (జంట), 7. సీరియల్ యాక్టర్ రవిక్రిష్ణ, 8. టీవీ యాక్టర్ అలీ రెజా, 9. టీవీ 9 జర్నలిస్ట్ జాఫర్, 10. పునర్వీ భూపాలం, 11. కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, 12. సింగర్ రాహుల్, 13. యూట్యూబ్ స్టార్ మహేష్, 14. టీవీ నటి రోహిణి, 15. డస్మాష్ స్టార్ అషూ రెడ్డి .

 

ఇక ఈ లిస్ట్ నిజమో కాదో తెలియాలంటే రేపటివరకు వెయిట్ చేయాల్సిందే. గ్ బాస్ 3 కార్య‌క్ర‌మం శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు, సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు స్టార్ మాలో ప్ర‌సారం కానుంది.

Leave a Reply