కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలి…సీఎల్పీ నేత భట్టి డిమాండ్

Share Icons:
-సీతక్క దీక్షకు స్పందించాలి
-న్యాయమైన డిమాండ్ అంగీకరించాలి
-కరోనా భాదితులకు రెమిడిసియర్ అందించాలి
-ఆక్సిజన్ , బెడ్స్ అందుబాటులో  చర్యలు తీసుకోవాలి

 

కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలంటూ  శాసనసభ్యురాలు సీతక్క, ఎన్.ఎస్.యూ.ఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్, ఇతర కాంగ్రెస్ నాయకులు చేస్తున్న నిరాహార దీక్షకు ప్రభుత్వం వెంటనే స్పందించాలి. కరోనాను ఆరోగ్యశ్రీలో ప్రభుత్వం వెంటనే చేర్చుతూ నిర్ణయాన్ని ప్రకటించాలి. సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనాతో రాష్ట్ర ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. కరోనా బాధితులకు ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకడం లేదు. అలాగే ఆసుపత్రుల్లో కరోనా రోగులకు ఆక్సిజన్, మందులు కూడా అందుబాటులో లేవు. ఇక కరోనా బాధితులకు సంజీవని వంటి రెమీడెసివర్ మెడిసన్ ను కొరత తీవ్రంగా వేధిస్తోంది. బెడ్స్, మందులు, రెమీడెసివర్ కొరత పేరుతో ధరలును విపరీతంగా పెంచుతున్నారు. వీటిని తట్టుకోవడం సామాన్యుల వల్ల కావడం లేదు. ఈ నేపథ్యంలో కరోనాను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలి. బ్లాక్ మార్కెట్ కు తరలుతున్న రెమీ డెసివర్ ఇంజక్షన్ పై తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకుని.. తక్కువ ధరకే కరోనా బాధితులకు అందించాలన్నారు.

గత అసెంబ్లీ సమావేశాల్లోముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ప్రయివేట్ ఆసుపత్రులను నియంత్రించేందుకు ఒక కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. ఇంతవరకూ ఆ కమిటీ ఏమి చేస్తోంది.. ఎక్కడ ఉందో తెలియడం లేదన్నారు . ప్రస్తుత పరిస్థితుల్లో ఆ కమిటి వెంటనే కార్యకలాపాలు చేపట్టి.. ప్రతి ఆసుపత్రిని సందర్శించి పర్యవేక్షణ చేయాలి.
ఎమ్మెల్యే సీతక్క, ఎన్.ఎస్.యూ.ఐ వెంకట్ ఆరోగ్య పరిస్థితికి ప్రభుత్వమే బాధ్యత వహించాలలని భట్టి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 

-కె. రాంనారాయణ, జర్నలిస్ట్.

Leave a Reply