భారత్ ఖాతాలో మరో స్వర్ణం, కాంస్యం…

bharat shooter sourab choudary won gold medal in asian games
Share Icons:

జకర్తా, 21 ఆగష్టు:

ఇండోనేషియాలో జరుగుతున్నఆసియా గేమ్స్‌లో భారత్ షూటర్లు దూసుకెళ్తున్నారు. పురుషుల 10మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ఈరోజు ఇద్దరు భారతీయులు పతకాలు దక్కించుకున్నారు. పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన అతిపిన్న వయస్కుల్లో ఒకడైన పదహారేళ్ల సౌరభ్ చౌదరి  భారత్‌కు షూటింగ్‌లో తొలి స్వర్ణాన్ని అందించాడు.

జపాన్‌కు చెందిన తొమొయుకి మత్సుదాతొ పాటు స్వదేశ ప్రత్యర్థి అభిషేక్ వర్మలకు గట్టి పోటీ ఇచ్చిన సౌరభ్, 240.7 పాయింట్లతో బంగారు పతకాన్ని సాధించాడు. దీంతో మత్సుదాకు రజతం, అభిషేక్ కు కాంస్యం దక్కాయి. ఇక ఇదే షూటింగ్ విభాగంలో దీపక్ కుమార్, లక్షయ్‌లకు రజత పతకాలు వచ్చిన విషయం తెలిసిందే.

కాగా, భారత్ మూడు స్వర్ణాలు, రెండు రజత, రెండు కాంస్య పతకాలతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతుంది. అలాగే మొత్తం 38 పతకాలతో చైనా మొదటిస్థానంలో, 31 పతకాలతో జపాన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాయి.

మామాట: కొనసాగుతున్న భారత్ పతకాల వేట…

Leave a Reply