హింసాత్మకంగా మారిన భారత్ బంద్…..

Share Icons:

ఢిల్లీ, 10 సెప్టెంబర్:

ఆకాశానికి చేరిన పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భారత్ బంద్ పలు రాష్ట్రాల్లో హింసాత్మకంగా మారింది.

చాలా చోట్ల విపక్ష పార్టీల నిరసనకారులు విధ్వంసాలకు దిగారు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఓ పెట్రోలు బంకును నాశనం చేశారు. ఒడిశాలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జన్ అధికార్ పార్టీ లోక్ తాంత్రిక్ కార్యకర్తలు పాట్నా, రాజేంద్ర నగర్ టర్మినల్ లో రైళ్లను అడ్డుకున్నారు. బీహార్ లో రోడ్లపైకి వచ్చిన ప్రభుత్వ వాహనాలను నిరసనకారులు ధ్వసం చేశారు.

అలాగే తెలంగాణలోని భువనగిరి, ముషీరాబాద్ బస్ డిపోల ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు బైఠాయించి, బస్సులను అడ్డుకున్నారు. మహారాష్ట్రలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు బలవంతంగా షాపులను మూసివేయించారు. ఇక ముంబై అంధేరీ రైల్వే స్టేషన్ ను ముట్టడించిన నిరసనకారులు, రైళ్లను అడ్డుకున్నారు. గుజరాత్ లోని భారుచ్ లో నిరసనకారులు బస్సుల టైర్లకు నిప్పంటించారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

మామాట: బంద్ శాంతియుతంగా జరగడం కష్టమే అనుకుంటా…!

Leave a Reply