
హైదరాబాద్, 25 జనవరి:
సినీ నటి భానుప్రియ తన ఇంట్లో పని చేస్తోన్న 14 ఏళ్ల సంధ్య అనే మైనర్ బాలికను హింసిస్తోందని, అలాగే భానుప్రియ సోదరుడు సంధ్యపై లైంగిక దాడి చేసినట్లు నిన్న వార్తలు వచ్చిన విషయం విధితమే. ఇక సంధ్య తల్లి ప్రభావతి భానుప్రియపై సామర్లకోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలోనే దీని గురించి భానుప్రియ స్పందిస్తూ.. సంధ్య తమ ఇంట్లో దొంగతనం చేసేదని, గట్టిగా నిలదీసేసరికి సంధ్య తల్లి డ్రామా చేస్తుందని వివరణ ఇచ్చింది. అలాగే సంధ్యను వెంటబెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్లింది భానుప్రియ. పోలీసుల ముందు మైనర్ బాలిక సంధ్య తనను ఎవరూ గృహనిర్బంధం చేయలేదని, భానుప్రియ ఇంట్లో తాను సంతోషంగానే ఉన్నట్లు తెలిపింది. భానుప్రియ సోదరుడు కూడా తనతో తప్పుగా ప్రవర్తించలేదని స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో ఏం జరిగిందనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మామాట: చెప్పిందా….చెప్పించారా…