-
ఘంటాపథంగా చెబుతున్న ఆయుర్వేధ వైద్యులు
-
రోజుకు ఎన్నితినాలి?
పెరిగి పెద్దయ్యాక… తమలపాకు తినడం చాలా మందికి ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికీ పల్లెల్లో చాలా మంది వక్కాకు నములుతూనే ఉంటారు.
వక్కా పొగాకు హాని చేసినా తమలపాకు చాలా శక్తులే ఉన్నాయట. అన్నింటికీ మించి ఆ శక్తి చాలా ఎక్కువ కలుగుతుందట.
అసలు తమలపాకులో ఉన్న సుగణాలేవో చూద్దాం.. భారతదేశంలో చాలా రాష్ట్రాలలో నేటికీ పాన్ పేరుతోనో, బీడా పేరుతోనో, వక్కాకు పేరుతోనో, తాంబూలం పేరుతోనో చాలా మంది తమలపాకులు తింటుంటారు.
మన పెళ్ళిళ్ళలో కూడా ఆకులు వక్కలను మార్చుకుంటారు. దానికి ప్రత్యేకంగా వక్కాకు శాస్త్రమని పేరు కూడా పెట్టారు. దీనికి కారణాలు తెలియకపోయినా చాలా మంది పాటిస్తుంటారు.
మొత్తంపై తమలపాకు మన జీవితంతో నిత్య భాగమన్నమాట. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. తమలపాకుల్లో పలు ఔషధ గుణాలున్నాయట, తమలపాకులను రోజుకొకటి నమిలితే..
గ్యాస్, అసిడిటీ తగ్గిపోతాయట. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందట, తిన్న తరువాత తాంబూలం వేసుకునేది కూడా అందుకేనేమో. దీనిలోని రసాలు రక్తంలో చేరి గ్లూకోస్ స్థాయిని తగ్గిస్తాయట.
దగ్గు ఎక్కువగా ఉన్నవారు తమలపాకుపై కాస్తంత తేనె రాసుకుని నమిలితే తగ్గిపోతుందట. అంతే కాదండోయ్… భోజనం తరువాత పడక గదిలో మొగుడికి పెళ్ళాం తమలపాకులను చిలకలు చుట్టి తినిపిస్తుంటారు. ఇది మనం ఎన్నో సినిమాల్లో చూశాం కూడా..
దీనికి బలమైన కారణం ఉంది. చిలకలు రోజూ నమిలితే లైంగిక పటుత్వం పెరుగుతుందిట. శృంగార సామర్థ్యం రెట్టింపు అవుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
అందుకేనేమో పెద్దలు మనజీవితంలో తమలపాకులను భాగం చేశారు. తమలపాకును ఇంకా చాలా వ్యాధుల నుంచి ఉపశమనానికి వినియోగిస్తారు.