టైటాన్స్ రెండో టై…రెండు పాయింట్ల తేడాతో ఓడిపోయిన బెంగళూరు

Bengal Warriors and Telugu Titans play out 29-29 draw in PKL 2019 ...
Share Icons:

అహ్మదాబాద్:

 

వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో తెలుగు టైటాన్స్ గత మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌పై గెలిచి తొలి విజయం సొంతం చేసుకుంది. అయితే సోమవారం బెంగాల్ వారియర్స్‌తో ఇక్కడ జరిగిన మ్యాచ్‌ను టైటాన్స్ టైగా ముగించింది. నిర్ణీత సమయంలో ఇరుజట్లు 29-29 పాయింట్లతో నిలువడంతో మ్యాచ్ డ్రాఅయింది.

 

తెలుగు జట్టు తరఫున సూరజ్ దేశాయ్ 7 పాయింట్లు సాధించగా.. స్టార్ ప్లేయర్ సిద్ధార్థ్ దేశాయ్ (4 పాయింట్లు) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 12 సార్లు ప్రత్యర్థి కోర్టులోకి రైడింగ్‌కు వెళ్లిన సిద్ధార్థ్ ఆరుసార్లు అందులోనే దొరికిపోవడం ఫలితంపై ప్రభావం చూపింది. బెంగాల్ తరఫున మొహమ్మద్ నబీబక్ష్ (8 పాయింట్లు), మణిందర్ సింగ్ (5 పాయింట్లు) రాణించారు.

 

మొత్తం మీద లీగ్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లాడిన టైటాన్స్ ఒక విజయం, ఐదు పరాజయాలు, రెండు టైలతో 13 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో 10వ స్థానంలో నిలిచింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి టైటాన్స్ 13-11తో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. రెండో సగం ఆరంభంలోనే ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసిన టైటాన్స్ తొలిసారి 5 పాయింట్ల లీడ్ సాధించగలిగింది.

 

ఒక దశలో 17-12, 19-15తో ముందంజలో కనిపించిన టైటాన్స్ వరుస పాయింట్లు కోల్పోయి 21-23తో వెనుకబడింది. ఈ దశలో ఇరు జట్లు రక్షణాత్మక ధోరణిలో ఆడటంతో పెద్దగా మెరుపుల్లేకుండా చివరకు మ్యాచ్ టైగా ముగిసింది. మరో మ్యాచ్‌లో యూపీ యోధా 35-33తో బెంగళూరు బుల్స్‌పై గెలిచింది. మంగళవారం లీగ్‌లో సెలవు రోజు కాగా.. బుధవారం జరుగనున్న మ్యాచ్‌ల్లో యూపీతో హర్యానా, గుజరాత్‌తో బెంగాల్ తలపడనున్నాయి.

 

Leave a Reply