Header Banner
Header Banner
TRENDING NOW

ఇటలీ సూపర్ బైక్ ఇండియాలోకి వచ్చేసింది..

ఇటలీ సూపర్ బైక్ ఇండియాలోకి వచ్చేసింది..

ఢిల్లీ, 20 ఫిబ్రవరి:

ఇటలీ సూపర్ బైక్‌ల తయారీ సంస్థ బెనెల్లీ..భారత్ మార్కెట్లోకి మరో రెండు నూతన బైకులను విడుదల చేసింది. అడ్వెంచర్ టూర్స్ కోసం వెళ్ళే యువకులని దృష్టిలో పెట్టుకుని రెండు బైక్‌లకు 500 సీసీ సామర్థ్యంతో తయారు చేశారు. వీటిలో టీఆర్‌కే 502 ధరను రూ.5 లక్షలుగా నిర్ణయించిన సంస్థ.. టీఆర్‌కే 502ఎక్స్ మోడల్ ధరను రూ.5.40 లక్షలుగా నిర్ణయించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. 

ఈ బైక్‌లను ఉత్పత్తి చేయడానికి గతేడాది హైదరాబాద్‌కు చెందిన మహావీర్ గ్రూపుతో బెనెల్లీ సంస్థ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.

GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
Life Homepathy
treefurn AD

టీఆర్కే 502 మోడల్ బైక్ రెడ్, వైట్, గ్రాఫిటి గ్రే రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ రెండు బైక్‌ల్లోనూ 500సీసీ, ట్విన్‌ సిలిండర్‌ ఇంజన్‌, 6 స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌, 20 లీటర్‌ ఇంధన ట్యాంక్‌ సామర్థ్యంతోపాటు ట్రెడిషినల్ బెనెల్లీ స్టీల్ ట్రెల్లీస్ ఫ్రేమ్, 4- వాల్వ్స్ పర్ సిలిండర్, 47.5పీఎస్ వద్ద 8500 ఆర్పీఎం, 46ఎన్ఎం వద్ద 6000 ఆర్పీఎం టార్చ్ తదితర ఫీచర్లు చేర్చారు. 

17 అంగుళాల అల్లాయ్ వీల్స్, 120/70 సెక్షన్ అండ్ రేర్ 160/60 సెక్షన్ పిరెల్లి టైర్లు అమర్చారు. రెండు బైక్‌ల్లోనూ ట్విన్ 320ఎంఎం ఫ్లోటింగ్ డిస్క్‌లు, స్విచ్ఛబుల్ ఏబీఎస్ అందుబాటులో ఉంది. 

మామాట: సాహస యాత్రలకి వెళ్ళే వారికి బాగుంటాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: