యోయో టెస్ట్‌పై కీలక నిర్ణయం…

bcci take a key decision yoyo test
Share Icons:

ముంబై, 20 జూన్:

భారత్ క్రికెట్ జట్టు ఆడే ప్రతి సిరీస్ ముందు యోయో టెస్టు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టెస్టులో కనీసం 16.1 మార్కులు తెచ్చుకున్న ఆటగాళ్ళే జట్టులో ఉంటారు. ఆ ప్రమాణాల్ని అందుకోకుంటే వేటు తప్పదు.

దీంతో యో యో టెస్టులో నెగ్గలేక తప్పుకుంటున్న భారత క్రికెటర్లు ఎక్కువవుతున్నారు. అఫ్ఘాన్‌తో ఏకైక టెస్టు కోసం పేసర్‌ మహ్మద్‌ షమి.. ఇంగ్లండ్‌ పర్యటన నుంచి అంబటి రాయుడు.. భారత ‘ఎ’ జట్టు నుంచి సంజూ శాంసన్‌ జట్టు ఎంపిక అయ్యాక విఫలమైనవారే. ఇక భారత్ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఆదివారం జరిగిన ఫిట్‌నెస్‌ టెస్టులో విఫలం కావడంతో, తనకు మరో అవకాశం ఇవ్వాలంటూ బోర్డు, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ను కోరడంతో బుధవారం రెండోసారి టెస్టుకు హాజరయ్యాడు. దీంట్లో రోహిత్ శర్మ పాస్ అయ్యాడు.

rohit super bating

అయితే ముందుగా జట్టులోకి ఎంపిక చేశాక ఫిట్‌నెస్‌ లేదంటూ తప్పించడమేంటని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్‌లో మంచి ఫామ్ కనబర్చిన రాయుడును కేవలం అరగంటపాటు యోయో టెస్టు నిర్వహించి పక్కనబెట్టడం సరికాదని పలువురు మాజీ క్రికెటర్లు బీసీసీఐ తీరును తప్పుబడుతున్నారు. రాయుడుకు మరో అవకాశమివ్వాలని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా బీసీసీఐ యోయో టెస్టుపై కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై యోయో టెస్టు పాసైన వారినే జాతీయ జట్టులోకి ఎంపిక చేయాలని నిర్ణయంచింది. అంటే ఎప్పటిలా జట్టు ఎంపిక చేసి యోయో టెస్ట్ నిర్వహించకుండా ముందుగానే టెస్ట్ పెట్టి జట్టు ఎంపిక చేయాలని అనుకుంటుంది.

ఈ మేరకు పరిపాలక కమిటీ (సీఓఏ) చైర్మన్ వినోద్ రాయ్ అధ్యక్షతన, సీఈవో రాహుల్ జోహీ, బీసీసీఐ జీఎం సాబా కరీమ్‌లు యోయోపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం పేసర్ మహ్మద్ షమి ఫిట్నెస్ నిరూపించుకునేందుకు మరో అవకాశం ఇవ్వబోతున్నారు. ఆ టెస్టు సిరీస్ కోసం జట్టును ఇంకా ప్రకటించకపోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

మామాట: ఈ నిర్ణయం ముందే తీసుకోవాల్సింది…

Leave a Reply