శ్రీలంక‌తో టీ20, ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగే టెస్టు సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఎంపిక

Share Icons:

ముంబయి, 5 డిసెంబర్:

భారతజట్టు టీ20 కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను నియమిస్తున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. అంతకముందు శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే.

వరుసగా మ్యాచ్‌లు ఖాళీ లేకుండా ఆడటం వలన కోహ్లీ విశ్రాంతి కావాలన్న కోరగా దానితో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వన్డేలు, టీ20 సిరీస్‌లకు విశ్రాంతి కల్పించింది.

ఐపిఎల్‌ నుంచి కోహ్లీ విశ్రాంతి లేకుండా క్రికెట్‌ ఆడుతున్నాడు. దీనితో రోహిత్‌నే టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేసింది.

శ్రీలంక‌తో త్వరలో జరగనున్న టీ20 సిరీస్‌తోపాటు, దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి మూడు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

అలాగే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న పేసర్‌ బుమ్రాకు టెస్టులకు పిలుపు అందింది.

దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన భారత టెస్ట్‌ జట్టులో బుమ్రాకు తొలిసారి స్థానం దక్కింది.

కాగా, వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ పటేల్‌, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మళ్లీ టెస్ట్‌ టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. సాహకు బ్యాకప్ కీపర్‌గా పటేల్ ఉంటాడు.

శ్రీలంకతో టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), దినేశ్ కార్తీక్, ఎంఎస్ ధోనీ, హార్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా, జస్ప్రిత్ బుమ్రా, జాదవ్ ఉనద్‌కట్,మహమ్మద్ సిరాజ్, బాసిల్ థంపి.

దక్షిణాఫ్రికాతో తలపడే టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), మురళీ విజయ్, శిఖర్ ధవన్, పుజారా, రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, పార్థివ్ పటేల్, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, షమీ, జస్ప్రిత్ బుమ్రా,ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్.

మామాట: మన దేశంలో పిచ్‌లపై బాగానే రాణిస్తున్నా టీమిండియా, దక్షిణాఫ్రికాలో ఎలా ఆడుతుందో చూడాలి..

Leave a Reply