ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్…

Share Icons:

ముంబయి, 15 ఫిబ్రవరి:

క్రికెట్ అభిమానులును ఉర్రూతులూగించే ఐపీఎల్-2018 11వ సీజన్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది… ఈ సీజన్‌లో అన్ని ఫ్రాంఛైజీలు కలిపి మొత్తం 60 మ్యాచ్‌లు ఆడనున్నాయి.

ఏప్రిల్ 7న మొదలై మే 27వ తేదీ వరకు 51 రోజులపాటు ఇవి కొనసాగనున్నాయి. ఈ 60 మ్యాచ్‌ల్లోని 12 మ్యాచ్‌లు సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుండగా, మిగితా 48 మ్యాచ్‌లు రాత్రి 8 గంటలకు ప్రసారం కానున్నాయి.

తొలి మ్యాచ్ ఏప్రిల్ 7న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌తో రెండు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.

అలాగే మే 27న జరిగే ఫైనల్ మ్యాచ్‌కి కూడా ముంబైలోని వాంఖడే స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

ఇక స్థానిక ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ఏప్రిల్ 9న ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.

పూర్తి షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Full schedule here – http://www.iplt20.com/schedule  #IPL2018

మామాట: ఇక ఈ సీజన్ ఏ స్థాయిలో అభిమానులని అలరించనుందో…

English summary:

VIVO Indian Premier League 2018 fixtures announced. The 11th edition of the world’s most popular and competitive T20 tournament will be played at nine venues across 51 days.

Leave a Reply