TRENDING NOW

ఇండియా-పాక్ మ్యాచ్..బీసీసీఐ లాజిక్‌గా మాట్లాడుతుందిగా..

ఇండియా-పాక్ మ్యాచ్..బీసీసీఐ లాజిక్‌గా మాట్లాడుతుందిగా..

ముంబై, 20 ఫిబ్రవరి:

పుల్వామా ఉగ్ర దాడితోపాటూ… వరుసగా మన దేశం సరిహద్దుల్లో జరుపుతున్న కాల్పుల్ని నిరసిస్తూ, పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లను రద్దు చెయ్యాలని దేశ ప్రజలతోపాటూ… బీసీసీఐలో మాజీ సభ్యులు, కొందరు వెటరన్ క్రీడాకారులు కూడా కోరుతున్న విషయం తెలిసిందే.

అయితే దీనిపై అటు బీసీబీఐ గానీ ఇటు కేంద్రంగానీ వెంటనే ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఇక వరుస ఒత్తిళ్ల మధ్య బీసీసీఐ పెద్దలు నోరు విప్పారు. ప్రపంచ కప్‌ నాటికి భారత ప్రభుత్వం పాక్‌తో ఆడకూడదని నిర్ణయిస్తే తాము దానిని పాటిస్తామని తెలిపారు.

Life Homepathy
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
treefurn AD

ఒకవేళ ఇండియా మ్యాచ్‌ను రద్దు చేసుకుంటే అది పాకిస్థాన్‌కి కలిసొస్తుందనీ, మ్యాచ్ ఆడకుండానే ఆ జట్టు పాయింట్లు పొందుతుందనీ స్పష్టం చేసింది. అదే విధంగా ఇండియా పాకిస్థాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగాల్సి వస్తే, ఆ సమయంలో ఇండియా మ్యాచ్ రద్దు చేసుకుంటే, మ్యాచ్ ఆడకుండానే పాకిస్థాన్ ప్రపంచ కప్ గెలిచినట్లవుతుందని క్లారిటీ ఇచ్చింది.

కాకపోతే ప్రపంచ కప్ జరగడానికి ఇంకా మూడు నెలల టైం ఉండటంతో… ఈలోపు రెండు దేశాల మధ్యా ఉద్రిక్తతలు తగ్గితే, మ్యాచ్ జరిగే అవకాశాలుంటాయని తెలిపింది. మరి చూడాలి ఆ సమయానికి ఎలాంటి పరిణామాలు ఉంటాయో.

మామాట: బీసీసీఐ లాజిక్ కూడా కరెక్ట్‌గానే ఉంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: