Header Banner
Header Banner
TRENDING NOW

ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్‌ను తప్పిస్తారా?

ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్‌ను తప్పిస్తారా?

ఢిల్లీ, 21 ఫిబ్రవరి:

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. రానున్న వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో క్రికెట్‌ ఆడాలా వద్దా అనే విషయంలో భారత్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకోవాలని చూస్తోంది. ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్‌ను నిషేధించాలని కోరడానికి సిద్దమవుతుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు నియమిత క్రికెట్ పాలక మండలి (సీవోఏ).. ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్‌ పేరిట ఓ లేఖను సిద్ధం చేసింది.

ప్రపంచకప్ నుంచి పాక్‌ను నిషేధించాలని, లేదంటే తామే వైదొలుగుతామని ఆ లేఖలో హెచ్చరించింది. న్యాయపరమైన అంశాలను పరిశీలించిన మీదట ఈ లేఖను ఐసీసీకి పంపడంపై నేడు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.  

Life Homepathy
treefurn AD
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,

అయితే ఈ నిర్ణయంపై  సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ విభేదిస్తున్నట్టు సమాచారం. అయితే కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు. శుక్రవారం జరగనున్న భేటీలో దీనిపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.

మామాట: మరి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: