టీమిండియాకు బీసీసీఐ నజరానా

Share Icons:
ముంబై, జనవరి 8,
ఆస్ట్రేలియా గడ్డ మీద తొలి టెస్టు సిరీస్ గెలిచిన టీమిండియాకు బీసీసీఐ నజరానా ప్రకటించింది. జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి రూ.15 లక్షల చొప్పున నగదు బహుమానం ఇవ్వనున్నట్టు తెలిపింది. ఆటగాళ్లు అందుకోబోయే బోనస్ మ్యాచ్ ఫీజ్‌కి సమానం. రిజర్వ్ ప్లేయర్లకు రూ.7.5 లక్షల నజరానా అందించనున్నట్టు తెలిపింది. ఆటగాళ్లతోపాటు కోచ్‌లకు కూడా ప్రోత్సాహకాన్ని బీసీసీఐ ప్రకటించింది. కోచ్‌లకు రూ.25 లక్షల చొప్పున నగదు బహుమానం అందించనున్నట్టు తెలిపింది.
సపోర్టింగ్ స్టాఫ్‌కు వేతనంతో సమానమైన నజరానా అందజేయనున్నట్టు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ స్పష్టం చేసింది. గతంలో బీసీసీఐ మహిళా, అండర్-19 జట్లకు కూడా నజరానా ప్రకటించింది. 2017 వరల్డ్ కప్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన భారత మహిళల జట్టుకు ఒక్కో క్రీడాకారిణికి రూ.50 లక్షల చొప్పున బీసీసీఐ నగదు రివార్డ్ అందజేసింది. అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన కుర్రాళ్ల జట్టుకు కూడా బీసీసీఐ గతంలో బహుమానం ప్రకటించింది.
ఒక్కో ఆటగాడికి రూ.30 లక్షలు ప్రకటించిన బీసీసీఐ.. ప్రధాన కోచ్ అయిన ద్రవిడ్‌కు రూ.50 లక్షలు, సహాయక సిబ్బందికి రూ.20 లక్షల చొప్పున నజరానా ప్రకటించింది. తనకంటే సిబ్బందికి తక్కువ రివార్డ్ ప్రకటించడం పట్ల ద్రవిడ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనకొచ్చే రివార్డ్ తగ్గించాలని కోరాడు. దీంతో అందరికీ సమానంగా రూ.25 లక్షల చొప్పున నజరానా అందజేసింది.
మామాట:  పిడికొద్ది రొట్టె– బాగా ఆడితే బాగా డబ్బులొస్తాయి. 

Leave a Reply