టీం ఇండియా టెస్ట్ జట్టు ప్రకటించిన బీసీసీఐ..

BCCI announces India squad for one-off Afghanistan Test
Share Icons:

ఢిల్లీ, 8 మే:

జూన్ 14న ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్‌ కోసం టీం ఇండియా జట్టు వివరాలను బీసీసీఐ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది.

కెప్టెన్ విరాట్ కోహ్లీ కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్తుండటంతో అతని స్థానంలో అజింక్యా రహానేకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

కాగా ప్రస్తుతం కౌంటీ క్రికెట్ ఆడుతున్న ఇశాంత్ శర్మ, చతేశ్వర్ పుజారాలు ఈ మ్యాచ్‌లో చోటు కల్పించారు.  దీంతో ఈ మ్యాచ్ జరిగే సమాయానికి వారు ఇండియాకు చేరుకుంటున్నారు.

ఇక ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ చరిత్రలో ఇది ఆ జట్టు ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌ కావడం విశేషం. దీంతో ఈ టెస్ట్‌లో విజయం సాధించేందుకు ఆ జట్టు తీవ్రంగా కృషి చేస్తుంది.

ఐపీఎల్ 11వ సీజన్ ముగిసిన తర్వాత జూన్ 14న ఈ టెస్ట్ మ్యాచ్ జరుగనుంది.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ చారిత్రాత్మక టెస్టు మ్యాచ్‌కి ఆతిథ్యం ఇవ్వనుంది.

టీం ఇండియా జట్టు వివరాలు: అజింక్యా రహానే(కెప్టెన్), శిఖర్ ధవన్, మురళీ విజయ్, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, కరుణ్ నైర్, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, హార్థిక్ పాండ్యా, ఇశాంత్ శర్మ, శార్ధూల్ ఠాకూర్.

మామాట: మరి ఈ పసికూన టీం ఇండియాపై ఎంతవరకు పోరాడుతుందో…?

Leave a Reply