ఐపీఎల్‌ల్లో ఎవరు ఏ జట్టులో ఉన్నారో తెలిసింది…

Share Icons:

ముంబయి, 5 జనవరి:

గురువారం ఐపీఎల్-2018కి సంబంధించి ఏ జట్టు ఎవరెవరు ఆటగాళ్లని అట్టిపెట్టుకుని ఉన్నజాబితాను బి‌సి‌సి‌ఐ అధికారంగా ప్రకటించింది. ఇలా ఆటగాళ్లని అట్టిపెట్టుకునే (రిటెయిన్‌) పాలసీ 2018 నుంచి 2020 వరకు మూడేళ్ల పాటు అమల్లో ఉంటుంది.

ముఖ్యంగా ఆటగాళ్లలో స్టార్ ప్లేయర్స్ ధోని, కోహ్లీని ఎవరు వదులుకోవడానికి సిద్దపడరు. అందుకు తగ్గట్టుగానే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు విరాట్‌ కోహ్లి, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు మహేంద్ర సింగ్‌ ధోనిలను అట్టిపెట్టుకుని ఉన్నారు.

అయితే అనూహ్యంగా కోల్‌కతా గంభీర్‌ని వదులుకుంది. ఇక పునరాగమనంలో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు స్టీవ్‌ స్మిత్‌ ఒక్కడినే తీసుకుంది. అదేవిధంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ డేవిడ్‌ వార్నర్, భువనేశ్వర్‌లను మాత్రమే తీసుకుని మూడో ఆటగాడిని ఎంచుకోలేదు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ రెండు జట్లు తమ రెండేళ్ల నిషేధాన్ని పూర్తి చేసుకుని ఆడనున్న విషయం తెలిసిందే. అలాగే ఈ నెల 27, 28 తేదీల్లో ఐపీఎల్‌–11 వేలం కార్యక్రమం జరుగుతుంది.

ఫ్రాంచైజీల వారీగా వివరాలు…

  1. చెన్నై సూపర్‌ కింగ్స్‌: మహేంద్రసింగ్‌ ధోని, సురేశ్‌ రైనా, రవీంద్రజడేజా
  2. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: విరాట్‌ కోహ్లీ, డివిలియర్స్, సర్ఫరాజ్‌ఖాన్‌
  3. దిల్లీ డేర్‌డెవిల్స్‌: రిషబ్‌ పంత్, శ్రేయాస్‌ అయ్యర్‌, క్రిస్‌మోరీస్‌(దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌)
  4. రాజస్థాన్‌ రాయల్స్‌: స్టీవ్‌ స్మిత్‌(ఆస్ట్రేలియా కెప్టెన్‌)
  5. ముంబయి ఇండియన్స్‌: రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్య, బుమ్రా
  6. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: డేవిడ్‌ వార్నర్, భువనేశ్వర్‌ కుమార్‌(బౌలర్‌)
  7. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌: సునీల్‌ నరైన్‌, ఆండ్రీ రస్సెల్
  8. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌: అక్షర్‌పటేల్‌

మామాట: అయితే ఫామ్‌లో ఉన్న ప్లేయర్స్‌ని ఏ జట్టు వదులుకోలేదు. ఒక్క గంభీర్ తప్ప.

English summary: BCCI announce the which player will be attached with the ipl teams. Dhoni is tie up with Chennai super kings and kohli is royal challenger Bangalore.

 

Leave a Reply