తెలంగాణలో నియోజకవర్గానికి బీసీ రెసిడెన్షియల్ స్కూల్

Share Icons:

హైదరాబాద్, 11 జూన్:

ఈ విద్యా సంవత్సరం నుంచి నియోజకవర్గానికి ఒక బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే త్వరలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కొత్తగా ఒక బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించనుంది తెలంగాణ ప్రభుత్వం.

ఇలా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 119 స్కూళ్లు సిద్ధమవుతున్నాయి. జూన్ 17న ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు లాంఛనంగా ప్రారంభిస్తారు.అయితే  తెలంగాణ ఏర్పాటుకు ముందు 19 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ మాత్రమే ఉండేవి. గత ఐదేళ్లలో తెలంగాణ సర్కార్ 142 కొత్త పాఠశాలలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గానికి ఒక స్కూల్ చొప్పున కొత్తగా మరో 119 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తోంది. దాంతో తెలంగాణలోని మొత్తం బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల సంఖ్య 280కి చేరనుంది.

Leave a Reply