బీసీలపై బాబు మొసలికన్నీరు.

bc cast votes tdp chandrababu
Share Icons:

తిరుపతి, జనవరి 28,

అప్పుకొని చేయు విభవము,

ముప్పునబ్రాయంపుటాలు, మూర్ఖుని తపమున్,

దప్పరయనినృపు రాజ్యము

దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ…

ఋణము దెచ్చుకుని అనుభవించే సౌఖ్యము, ముసలి వయసులో పడుచు భార్య, మూర్ఖుని తపస్సు, తప్పు తెలుసుకోలేని రాజు పరిపాలన, సహించరానిదై చివరకు హానికలిగించును…  ఈ సుమతి శతకకారునికి ఉన్న విజ్ఞత కూడా నేటి మన పాలకులకు లేదు.

[pinpoll id=”68835″]

వేషం ఎందుకు వేస్తాం… మోసం చేయడానికి. ఒక నటుడు రంగస్థలంపై ఒక వేషం ధరించినపుడు.. ఆ పాత్ర రూపంలో అతను ప్రేక్షకులను మోసగిస్తున్నాడు. పాత్రే నిజం, కళాకారుడు అవాస్తవం అనే విధంగా జీవించడం నటన ఔతుంది కదా,  పాత్రతోపాటు మనం ఏడుస్తాం, నవ్వుతాం, అయ్యో అంటూ బాధ వ్యక్తం చేస్తాం.. అపుడు ఆ కళాకారుడు ఉత్తమ నటుడు ఔతాడు కదా, అంతే కదా..

 

మరి గుంటూరులో నారా హమారా అంటూ ఓ వేషం, నిన్న రాజమహేంద్రవరంలో జయహో అంటూ మరో కల్లు గీత కార్మికుని వేషం. అవన్నీ ఎవరికోసం.. ముఖ్యమంత్రులు అందురూ ఇలానే పనిచేస్తున్నారా? రోజుకో వేషం వేస్తున్నారా.? పరిపాలనపై దృష్టిపెట్టకుండా, అధికారులపై పట్టు లోకుండా, ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ఇలా సభలు-దీక్షల పేరుతో కాలహరణ చేయడం సీనియర్ నాయకుడని చెప్పుకునే చంద్రబాబుకు తగునా..? ప్రజలు నమ్మి ఇచ్చిన అధికారాన్ని వంశాభివృద్ధికి కైంకర్యం చేసి, ఇట్లా ఎన్నికల ముంగిట్లో వివిధ వర్గాలకు అలవికాని తాయిలాలు ప్రకటించడం మంచి సంప్రదాయమేనా…! గత నాలుగు సంవత్సరాలుగా కనిపించని బీసీలు ఇపుడెందుకు అకస్మాత్తుగా ఆత్మీయులుగా మారిపోయారు.! ఇంతకాలం కార్పోరేషన్లు ఎందుకు ఏర్పాటు చేయలేదు. కులాల వారీగా ఇలా సమాజాన్ని చీల్చి ఎన్నికల్లో పావులుగా వాడుకుని వదిలిపెట్టే విషసంస్కృతిని చంద్రబాబు ఎందుకు పెంచి పోషిస్తున్నట్టు..? అధికారం పొందడానికి ఇంత దారుణంగా సమాజంలో చిచ్చుపెట్టాలా…?

మామాట: తాత్కాలిక తాయిలాలతో బీసీ వర్గాలకు మేలుజరుగుతుందా.

Leave a Reply