శాంతాక్లాజ్‌గా ఒబామా..  పిల్లల ఆసుపత్రిలో సందడి

Share Icons:

వాషింగ్టన్, డిసెంబర్ 21,

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయా. ఇందులో భాగంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.. శాంతాక్లాజ్ రూపంలో అందరినీ ఆశ్చర్యపరిచారు. వాషింగ్టన్‌లోని డీసీ చిన్న పిల్లల ఆస్పత్రిని సందర్శించిన ఆయన.. శాంతాక్లాజ్‌ టోపీ పెట్టుకుని పిల్లలకు దర్శనమిచ్చారు. అంతేకాదు సంచిలో కానుకలతో అక్కడికి వెళ్లడం విశేషం. పిల్లలతో కబుర్లు చెబుతూ, ఆడుతూ ఒబామా సందడి చేశారు. వారికి తనతో పాటు తెచ్చిన కానుకలను అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘చిల్డ్రన్ నేషనల్’ అనే స్వచ్ఛంద సంస్థ ఈ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది.

ట్విట్టర్‌లో తన ఆనందాన్ని ఒబామా పంచుకున్నారు. ‘‘పిల్లలకు, తల్లిదండ్రులకు, హాస్పిటల్ సిబ్బందికి క్రిస్మస్ శుభాకాంక్షలు. శాంతా రూపంలో.. ఈ అద్భుతమైన పిల్లలతో గడిపే అవకాశాన్ని కల్పించిన హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్ చేశారు. మనసుంటే సేవచేయడానికి మార్గం ఉంటుందని రుజువు చేశారు.

మామాట:  మనసున్నమారాజనిపించుకున్నారుగా

Leave a Reply